ప్రతి ఒక్కరూ తమ చర్మం అందంగా,మెరుగ్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పొల్యూషన్, ఆహారాల అలవాట్లు, జీవన విధానం చర్మాన్ని నిర్జీవంగా మారుస్తోంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన ఆహారాలవాట్లు తప్పనిసరిగా మార్చుకోవాలి. మరియు కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం మానివేయాలి. అందమైన చర్మం కోసం ఎలాంటి లేపనాలు వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1). న్యాచురల్ ప్రొడక్ట్స్..
ఇందులో విటమిన్ సి, మినరల్స్, సహజ పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలుగ చేయవు. మరియు మొటిమలు, మచ్చలు,మృతకణాల వల్ల పాడైన చర్మాన్ని బాగుచేస్తాయి.

2).కుంకుమ పువ్వు..
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని లేపనంగా వేసుకోవడం వల్ల మచ్చలు, మొటిమలు,నలుపుదనం తగ్గించడానికి చేసే చికిత్సలో దీనిని ఎక్కువగా వాడతారు. దీనిని వారానికి రెండు సార్లు లేపనంగా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3). అశ్వగంధ..

అశ్వగంధ అందానికి మంచి మెరుగులు దిద్దుతుంది.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముడతలను మృదువుగా చేయడంలో, చర్మాన్ని అందంగా మార్చడంలోనూ సహాయం చేస్తుంది.

4).కుంకుమాది తైలం..
దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మంపై కల, మృతకణాలను తొలగించి, చర్మం అందంగా తయారైందుకు ఉపయోగపడుతుంది.

5). బాదాం అయిల్..

బాదం ఆయిల్ లో ఉండే విటమిన్ ఈ చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. స్కిన్‌ కండిషన్‌ని సెల్యులైట్‌ చేస్తుంది.

6).రోజ్మేరీ అయిల్..
దీనికి అందానికి వాడే లేపణాల్లో ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీనిని పడుకోబోయే ముందు మొఖానికి, కాళ్ళు, చేతులకు మర్దన చేయడం వల్ల చర్మన్ని రిఫ్రెష్ చేసి కాంతివంతంగా మారుస్తుంది. దీనిని ఎక్కువగా అరోమాథెరపీలో తరచుగా దీన్ని ఉపయోగిస్తారు.

7).వీటన్నింటికి తోడుగా తగినంత నీరు త్రాగాలి. ఇందువల్ల చర్మం డీ హైడ్రైట్ కాకుండా కాపాడుతుంది.


8). పాచ్యులీ..  
ప్యాచులి అనేది ఓ  ఆయుర్వేద మొక్క. దీన్ని నుంచి మంచి అరోమేటిక్ ఆయిల్‌ తీస్తారు.దీనిని పై పుతగా వాడటం వల్ల,ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాంటి చర్మ సమస్యలకైనా పరిష్కారం చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: