
తలనొప్పి అధికంగా భావిస్తున్నప్పుడు.. మీ పెరటిలోని రెండు తమలపాకులను తీసుకొని చేతిలో నలిపి దాని ద్వారా వచ్చే రసాన్ని నుదుటి పైన రుద్దాలి.. లేదా తమలపాకులను డైరెక్ట్ గా నుదుటి పైన పెట్టి ఏదైనా గుడ్డ సహాయంతో కట్టు కట్టి నిద్రపోవాలి. అయితే రాత్రి సమయంలో ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది . మీ తలలో ఉండే వేడిని తమలపాకులు గ్రహిస్తాయి. తద్వారా తలనొప్పి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది . ఇలా వరుసగా కొద్దిరోజులు చేశారంటే త్వరిత ఉపశమనం కలుగుతుంది. ఈ తమలపాకు ఆరోగ్యంగానే కాదు సాంప్రదాయంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
మన భారతదేశంలో పెళ్లి అయిన పేరంటమైనా నోమైనా,వ్రతమైన ఇలా ఏ శుభకార్యమైనా తప్పక తమలపాకులు ఉండాల్సిందే.... పూర్వకాలంలో భోజనం తర్వాత అందరూ తప్పనిసరిగా తాంబూలాన్ని స్వీకరించేవారు. అంతేకాదు తమలపాకుల్ని, పాన్ మసాలాను తీసుకునేవారు. పూర్వం మన పెద్దవాళ్లు తమలపాకును ప్రతి శుభకార్యంలోను ఉపయోగించేవారు. నాగవల్లి దళం అనే తమలపాకు దేవతా దళము. తొటిమలో లక్ష్మీదేవి, మధ్యభాగాన పరమేశ్వరుని సతి పార్వతి దేవి, కొన భాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతి దేవి ఉంటారు. ఇంద్రుడు, మన్మధుడు, విష్ణువు,శివుడు, బ్రహ్మ తమలపాకుపై సదా కొలువుతీరి ఉంటారు.