చిలకడ దుంప ఇది రుచికి తియ్యగా ఉంటుంది. ఇందులో కరిగిపోయే ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పైబర్ కంటెంట్ తో పాటు షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ దుంప శరీరానికి ఎన్నో పోషకాలను అందించి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె లయలను,నాడి వ్యవస్థ ను కంట్రోల్ చేస్తుంది. దీనిని తరుచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు, వాపులు, కండరాల పట్టేయడం వంటి వాటి నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది.
ఇ సీజన్లో ఎక్కువగా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ లకు గురి అవుతుంటారు. వీటిని ఎదురించడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అయితే, విటమిన్-c ఉన్నచిలకడ దుంపను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం చాలామంచిది . ఇది క్యాన్సర్ను కలిగించే ప్రీరేడికల్స్ తో పోరాడి, వాటిని నుంచి కాపాడుతుంది.మనం బంగాళాదుంప చిప్స్ కన్నా వాటి బదులుగా చిలకడదుంప చిప్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆలూ చిప్స్ తినడం వల్ల అధిక బరువు పెరగడం,గ్యాస్, ఆజీర్తి వంటి సమస్యలు అధికమవుతాయి. స్వీట్ పొటాటో రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలను ఉత్పత్తి పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.అంతే కాక ఇది మానసిక ఆందోళనలు తగ్గించేందుకు చాలా బాగా సహాయ పడుతుంది.చిలకడ దుంపను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.దీనిని నెలల పిల్లలకు కూడా వుండికించి, మెత్తగా చేసి పెట్టడం వల్ల, వారి ఎదుగుదల బాగా మెరుగవుతుంది. కాబట్టి చిలకడ దుంపను మన డైట్ లో చేర్చుకోవడం చాలా ఉత్తమం.