కొంతమందికి ఉదయం లేవగానే మెడ పట్టేసినట్టు, మెడ తిప్పలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఇలా మెడ నొప్పి ఉంటే రాను రాను అది స్పాండిలైటిస్ కి కారణం అవుతుంది. ఈ మెడ నొప్పి కాస్త క్రమంగా భుజాలు, చేతివేళ్ల వరకు వ్యాపించి ఆ భాగాలు పనిచేయకుండా చేస్తుంది.చేతి తిమ్మిర్లు,చేతితో ఏ వస్తువును పట్టుకోలేకపోవడం, తల నొప్పితో కూడిన భుజాల నొప్పి వంటివి లక్షణాలుగా చెప్పవచ్చు.

 స్పాండిలైటిస్ రావడానికి కారణాలు..
 స్పాండిలైటిస్ రావడానికి ఒత్తిడి, ఎక్కువగా నిల్చోని ఉండడం, అదేవిధంగా కంప్యూటర్ ముందర ఎక్కువగా తల తిప్పకుండా కూర్చోవడం, రోజూ ఎక్కువ దూరం ప్రయాణించడం,మద్యపానం,ధూమపానం వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు.

 స్పాండిలైటిస్ కి తగిన చికిత్స..
 మెడనొప్పి, మెడ పట్టేసినట్టు ఉండడం, చేతులు తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు గమనిస్తూనే వైద్యనిపుణులను సంప్రదించడం చాలా మంచిది.

 ఎక్కువ దూరం ప్రయాణించకపోవడం..
 ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే, ప్రయాణ సమయంలో కొంచెం కొంచెం విరామం తీసుకుంటూ ప్రయాణించడం చాలా ఉత్తమం. అలా చేయడం వల్ల  వెన్నెముకపై భారం పడకుండా ఉంటుంది. మరియు మోకాలలోని డిస్కులు  నొప్పికీ గురి కాకుండా ఉంటాయి.

 కంప్యూటర్ ముందుతక్కువ సమయం గడపడం..
 ఇప్పుడున్న ఉద్యోగాల దృష్ట్యా కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చోవాల్సి వస్తుంది. అలాంటివారు కంప్యూటర్ ముందర కూర్చోన్నప్పుడు,గంటకి ఒక్కసారైనా మెడ తిప్పడం, మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడం,కూర్చున్న కుర్చీలో నుంచి లేచి,అటు ఇటు తిరగడం వంటివి చేస్తూండాలి.

 ఒత్తిడిని తగ్గించుకోవడం..
 మానవునిలో సగం రోగాలకు కారణం ఒత్తిడే అని చెప్పవచ్చు.దీనిని తగ్గించుకోవడం కోసం వినోదభరితమైనవి చూడటం, తమకి ఇష్టమైన ఆటలు ఆడటం, తగిన ఆహారాలు తినటం వంటివి చేయడం వల్ల, ఒత్తిడి కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా తగినంత ఆటంకాలు లేని నిద్ర చాలా అవసరము.

 చెడు అలవాట్లకు దూరంగా ఉండడం..
 మద్యపానం మరియు ధూమపానం వల్ల, కీళ్ల ఆరోగ్యం దెబ్బతిసి,స్పాండిలైటిస్ కి కారణం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ వీటికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: