కాల్షియం..
క్యాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల పిల్లల ఎముకల దృఢత్వానికి మరియు వారి ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈ న్యుట్రియెంట్ ఎముకలకే కాక దంతాల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాల్షియంను పొందడానికి పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా వారి రోజువారి ఆహారంలో ఇవ్వాలి.
విటమిన్ కె..
విటమిన్ K అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల, ఎముక తయారీకి దోహదపడుతుంది. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది.విటమిన్ K అధికంగా లభించే ఆహారాలు అయిన ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, గుడ్లు, చేపలు మరియు మాంసం వంటివి పిల్లలకు ఎక్కువగా ఇస్తువుండాలి.
మెగ్నీషియం..
మెగ్నీషియం రక్తం నుండి కాల్షియం శోషించుకుని ఎముకలకు అందించే ఒక ముఖ్యమైన న్యూట్రియెంట్. ఎముకల మెటబాలిజంకు మెగ్నీషియం చాలాబాగా సహాయపడుతుంది. మెగ్నీషియం అధికంగా లభించే ఆహారాలయినా బాదం, పిస్తా, వేరుశనగ పప్పులు, కినోవా, మరియు గోధుమపిండి వంటి ఆహారాలను పిల్లలకు ఎక్కువగా ఇవ్వడం వల్ల,వారి ఎముకల దృఢత్వానికి దోహదపడతాయి.
విటమిన్ డి..
ఎముకలు పెరుగుదలకు మరియు దృఢత్వానికి, ఉపయోగపడుతుంది.విటమిన్ డి సూర్యరశ్మి నుండి ఎక్కువగా పొందవచ్చు.కావున పిల్లలను ఉదయం,సాయంత్రం ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. దీనితో వారికి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. దీనితోపాటు పాలు,చేపలు ఆహారాలను కూడా ఎక్కువగా ఇస్తూండాలి. అంతేకాక పిల్లల ఎముకల దృఢత్వానికి వ్యాయామం తప్పకుండా చేయడం అలవాటు చేయాలి.