సాధారణంగా మన చుట్టూ ఉండే పెద్దలు మాట్లాడుతున్న సమయంలో కొంతమంది చేస్తున్న పనులను అభివర్ణించడానికి కొన్ని సామెతలను వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి సామెతల్లో అటు మొసలి మీద కూడా కొన్ని సామెతలు ఉన్నాయి. ముందుంది ముసళ్ళ పండగ అని కొంతమంది విషయంలో అంటుంటే మొసలి కన్నీరు అని మరి కొంతమంది విషయంలో కూడా సామెతలను వాడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలాంటి సామెతలను విన్నప్పుడు ఇది ఎప్పుడు వాడే పదాలే కదా అని కొంతమంది లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ మరి కొంతమంది ఈ సామెతల వెనక అసలు అర్థం ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే పెద్దలు తరచుగా వాడే ముసలి కన్నీరు అనే సామెతకు అసలు అర్థం ఏమిటి.. ఎవరి విషయంలో ఈ సామెతను వాడుతుంటారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే కేవలం మన చుట్టుపక్కల ఉన్న పెద్దలు మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా నిత్యం ఇలాంటి పదాలను వాడుతూ ఉంటారు.  ప్రత్యర్ధులను విమర్శించడానికి మొసలి కన్నీరు కార్చడం లాంటి పదాలను తరచూ వాడటం చూస్తూ ఉంటాం. అయితే ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాసులు కూడా కన్నీళ్లు పెడుతూ ఉంటాయి. కానీ కేవలం మొసలి పేరునే ఎందుకు వాడుతారో ఇప్పుడు తెలుసుకుందాం.


 మొసలి కన్నీరు కార్చడం నకిలీ ఏడుపును సూచించడానికి ఉపయోగిస్తారు. ఇక దీనిపై శాస్త్రవేత్తలు కూడా ఒక పరిశోధన జరుపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  2006లో న్యూరాలజిస్ట్ డి మాల్కం షీనర్ అనే శాస్త్రవేత్త ఎలిగేటర్లు,  మొసలి కన్నీటి పై పరిశోధన చేయగా.. ఈ జీవులు ఆహారం తింటూ ఉంటే వాటి కళ్ళ నుంచి బుడగలు కన్నీరు రావడం జరుగుతుందట. అయితే అవి కన్నీళ్లు పెట్టడానికి వాటి బాధ కారణం కాదని ఆహారం.. తినే సమయంలో స్వతహాగా ఇక  కన్నీరు బయటకు వస్తాయట. అందుకే నకిలీ కన్నీరు. కాబట్టి ఇక నకిలీ ఏడుపుకు ఉదాహరణగా మొసలి కన్నీరు అని వాడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: