ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది సమయానికి తిండి , నిద్ర లేకుండా తమ పనులలో నిమగ్నమై జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా చాలామంది పని, ఒత్తిడి.. ఇతర కారణాలవల్ల రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్నారు. మరి కొంతమంది టీవీలు , సెల్ ఫోన్, లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. ఇలా రాత్రిపూట లేటుగా నిద్రపోతే ఫలితంగా కళ్ళ కింద మచ్చలే కాదు అంతకుమించి ఆరోగ్య సమస్యలు కూడా ఆవహిస్తున్నాయి.

కంటి నిండా నిద్రపోయినప్పుడే గుండె జబ్బులు, ఊబకాయం,  మధుమేహం వంటి ఎన్నో రోగాల నుంచి ముప్పు తగ్గుతుంది. నిద్ర ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది అని ఎన్నో అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.. అంతేకాదు రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే పొగటిపూట నిద్రపోవాల్సి వస్తుంది. పైగా పగటిపూట నిద్రకు అలవాటయితే మాత్రం రాత్రిళ్ళు ఏం చేసినా సరే నిద్ర మాత్రం అస్సలు రాదు. సమయానికి నిద్రపోకుండా ఉండడం వల్ల.. అలసట, చిరాకు , అధిక రక్తపోటు,  రోగనిరోధక శక్తి లోపించడం , మానసిక ఒత్తిడి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు కూడా ఏర్పడి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది.

అంతేకాదు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడతారు..కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే సరైన సమయానికి నిద్రపోవడానికి అలవాటు పడాలి.  అప్పుడే నిద్ర త్వరగా పడుతుంది. ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలో కూడా ఒక షెడ్యూల్ ని తయారు చేసి పెట్టుకోవాలి .రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు మీరు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలి.. అలాగే లైట్ ఆఫ్ చేసి మరి నిద్రపోవడం వల్ల నిద్రకు భంగం  కలగదు.. రాత్రి పడుకునే ముందు తక్కువ తినడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.  అలాగే వేయించిన ఆహార పదార్థాలు,  నూనె , కారంగా ఉండే వాటిని అస్సలు తినకండి. రెగ్యులర్గా పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలను తాగి నిద్రపోవడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.  తద్వారా మీరు ఆరోగ్యంగా జీవిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: