కాఫీ,టీ లు త్రాగటం..
చాలామందికి ఉదయం లేవగానే కాఫీ కానీ టీ కానీ కాకపోతే రోజు గడవదని చెప్పవచ్చు.ఇలా రోజు వీటిని తీసుకోవడం వల్ల,అందులోని కెఫెన్ వయసు మీరకనే వృద్ధాప్య ఛాయలు వచ్చేందుకు దోహదం చేస్తుంది. మరియు ఇందులో వాడే షుగర్,రక్తంలో చక్కర స్థాయిలను పెంచి మధుమేహానికి గురి చేస్తుంది. వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల, పొట్టలో ఆసిడిక్ విలువలను పెంచి,జీర్ణ సమస్యలకు గురి చేస్తుంది.
సీజనల్ ఫ్రూట్స్ తినకపోవడం..
కాలనుగుణంగా పండే పండ్లను తినకపోవడం వల్ల కూడా వృద్యాప్య ఛాయలు తొందరగా అలుముకుంటాయి. తరుచుగా పండ్లు తీసుకోవడం వల్ల, అందులోని పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యాంగా, అందంగా ఉంచడానికి సహాయపడతాయి.
పొగ త్రాగటం..
దుమపానం ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంటారు. ఇది కేవలం ఆరోగ్యానికే కాక,అందాన్ని కూడా దెబ్బతిస్తుంది.కావున తొందరగా వృద్యాప్య ఛాయలు రాకూడదు అనుకుంటే దుమఫానానికి దూరంగా ఉండటం చాలా మంచిది.
ఆల్కహాల్ తీసుకోవడం..
తరుచు ఆల్కహాల్ తీసుకొనేవారికి కూడా వృద్యాప్యచాయాలు తొందరగా అలుముకుంటాయి. ఇందు లోని చెడు గుణాలు శరీర జీవక్రియ రేటును తగ్గించి, ఆరోగ్యానికి హాని చేస్తుంది.
వ్యాయామలు చేయకపోవడం..
ఈ ఊరుకులు పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి సమయం లేదని చాలా మంది వ్యాయామాలు చేయరు. తరుచు వ్యాయామలు చేయడం వల్ల కూడా వృద్యాప్య ఛాయాలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్యానిపుణులు సూచిస్తున్నారు.
కావున 40 ల్లో కూడా 20ల్ల కనిపించాలంటే తగిన శారీరక శ్రమ చేస్తూ,మంచి అలవాట్లను పాటిస్తే సరి కావున ప్రతి ఒక్కరూ పైన చెప్పిన అలవాట్లను దూరం చేసుకోండి, నిత్య యవ్వనంగా ఉండండి.