మధుమేహంతో బాధపడేవారు..
ఈ పండులో సాధారణంగా న్యాచురల్ చక్కెరలు అధికంగా ఉంటాయి. కావున మధుమేహంతో బాధపడే వారు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అతిగా పండిన అరటిపండ్లను తింటే వారి రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలు పెరిగి, తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.
మూత్రపిండాలు దెబ్బతిన్నవారు..
ఈ పండ్లలో శరీరానికి కావాల్సిన పొటాషియం పుష్కళంగా లభిస్తుంది.కానీ మూత్రపిండాలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నవారికి ఎక్కువ హాని కలగజేస్తుంది.మరియు శరీరంలోని అదనపు పొటాషియం విసర్జించడం కోసం, కిడ్నీ పై భారం పెరుగుతుంది.కావున వీరు అరటిపండు తినకపోవడం చాలా మంచిది.
గ్యాస్ సమస్యలు..
ఎక్కువగా గ్యాస్,మలబద్ధకం సమస్యలు కలిగినవారు అరటిపండ్లను తీసుకోకపోవడం మేలు చేస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.వీటిని తీసుకోవడంతో, ఇది ఆరోగ్య సమస్యను తొలగించడానికి పోయి,పెంచడానికి దోహదం చేస్తాయి.
అలర్జీ
డస్ట్ అలర్జీ బాధపడేవారు వీలైనంత వరకు అరటిపండ్లు తినకపోవడం చాలా మంచిది.లేకుంటే దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులోని అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తాయి.
టీబీ రోగులు..
సాధారణంగా అరటిపండుకి చలువ చేసే గుణం ఉంటుంది. కావున టీబీ తో బాధపడేవారు అరటిపండు అస్సలు తినకూడదు.లేదంటే వారి సమస్య మరింత పెరుగుతుంది.