
వేపాకు:
వేపాకు సుగుణాల గురించి అందరికీ తెలిసిందే. వేపాకులు పరగడుపునె నమలి మింగడం వల్ల, ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కడుపులోని చెడు బ్యాక్టీరియా నశించి చేయడమే కాక, క్లోమం పనితీరును మెరుగుపరిచి, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనితో రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచి మధుమేహం రాకుండా సహాయపడుతుంది.మరియు ఇందులోని యాంటీ ఫంగల్ లక్షణాలు తామర, పుండ్లు, దురదలు వంటి ఎన్నో రకాల అలర్జీలను కూడా దూరం చేస్తుంది.
కలబంద ఆకులు :
కలబందనలోని ఔషధ గుణాల వల్ల దీనిని ఆయుర్వేద చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది.మరియు దీనిని పెంచుకోవడం కూడా చాలా సులభం.మధుమేహ చికిత్స కోసం, కలబంద ఆకులను బాగా కడిగి, ఒక మాత్ర సైజులో రోజు తీసుకోవడం వల్ల ప్యాంక్రియాజ్ లో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి,రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సహాయపడి,మధుమెహన్ని దరిచేరనివ్వదు.మరియు ఆరోగ్యానికి కాక అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
సీతాఫలం ఆకులు :
సీతాఫలం ప్రతి ఒక్కరికి ఇష్టమైనవి.సీతాఫలం ఆకుల యొక్క రసం రోజు పరగడుపునే తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి,రక్తంలోని చక్కెరలను క్రమబద్ధీకరించి షుగర్ రాకుండా కాపాడుతుంది.