మన శరీరంలో రక్తం సక్రమంగా సరఫరా అయితేనే జీవ క్రియ రేటు సజావుగా ఉంటుంది.రక్త సరఫరా సరిగా లేనివారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి.ముఖ్యంగా గుండె,కిడ్నీలు,మెదడు పనితీరు మందగిస్తుంది.దీనికి కారణం ఒబేసిటీ, ధూమపానం డయాబెటిస్ వంటివి అధికంగా ఉండటమే.ఇలాంటి అలవాట్లు ఉన్న వారిలో తక్కువ రక్త సరఫరా జరిగి,వారికి నొప్పులు,కండరాలు పట్టేసినట్టు ఉండడం, కాళ్లు చేతులు చల్లబడి పోవటం వంటివి జరుగుతూ ఉంటాయి.కావున రక్త సరఫరా పెంచుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

శరీరంలో రక్త సరఫరాని మెరుగుపరచుకోవడానికి జీవనశైలిలో మార్పులు,మద్యపానం,ధూమపానానికి దూరంగా ఉండటం,ఒత్తిడి,ఆందోళనను తగ్గించుకోవడం,నూనెలో వేయించిన వస్తువులు తక్కువగా తీసుకోవడం,సరిగా వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి.మరియు వీటితోపాటు ఈ ఆహారం తీసుకోవడం చాలా మంచిది.అవి ఏంటంటే

ప్లవణాయిడ్స్ అధికంగా ఉన్న ఆహారం..
ప్లవణాయిడ్స్ అధికంగా ఉన్న ఉల్లి, దానిమ్మ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తనాళాలు సరిగా ఓపెన్ అయి,గుండెకు రక్తాన్ని సక్రమంగా సరఫరా చేయడం వల్ల,రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

నైట్రిక్ ఆక్సైడ్..
నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉన్న ఆహారాలు ఎర్ర మిరపకాయలు, తెల్ల గడ్డలు దాల్చిన చెక్క బీట్రూట్ మరియు కూరలను అధికంగా తీసుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది.

విటమిన్ సి ..
విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు కమలాపండు, ఆపిల్,పుచ్చకాయ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇందులోని యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు రక్త సరఫరా సక్రమంగా జరిగేందుకు దోహదపడతాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్..
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న డ్రై ఫ్రూట్స్,  చేపలు వంటివి అధికంగా తీసుకోవడం వల్ల,గుండె పనితీరును మెరుగుపరిచి,రక్త సరఫరా సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయి.

టమాటాలు..
టమాటా మరియు బెర్రీస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, అందులోని అగియోటెన్సిన్ అనే ఎంజైమ్ శరీరంలోని ఒత్తిడి తగ్గించి,రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: