ఈ క్రమంలోనే ప్రతి గ్రామం ప్రతి పట్టణం కూడా ప్లాస్టిక్ రహితంగా మారాలి అంటూ పిలుపునిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే ఇక ప్రభుత్వాలు సైతం ప్లాస్టిక్ పై బ్యాన్ విధించి ఇక మానవాళి మనుగడను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇక తమ తమ గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేందుకు అటు సర్పంచ్లు కూడా వినూత్నమైన రీతిలో చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సర్పంచ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ గ్రామం గ్రామస్తులందరి సహకారంతో 15 రోజుల్లోనే ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారిపోయింది.
సాధారణంగా అయితే గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారుద్దామని ఎవరైనా నీతులు చెబితే గ్రామస్తులు అసలు వినరు. అందుకే ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు జమ్మూ కాశ్మీర్ లోని సాదిబార అనే గ్రామం సర్పంచ్ గా ఉన్న వ్యక్తి. ఏకంగా ప్లాస్టిక్ తెచ్చివ్వండి బంగారం తీసుకువెళ్లండి అంటూ ఆఫర్ ప్రకటించాడు. 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ తీసుకువస్తే బంగారు బిల్లును ఇవ్వడం మొదలుపెట్టాడు. దీంతో గ్రామస్తులు పోటీపడి మరి ప్లాస్టిక్ను సేకరించడం మొదలుపెట్టారు. దీంతో 15 రోజుల్లోనే ఆ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారిపోయింది. ఇక ఈ విషయం తెలిసిన మిగతా గ్రామాల సర్పంచులు కూడా ఈ ఐడియా ఏదో బాగుందని వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అని చెప్పాలి.