ఇటీవల కాలంలో మనిషి రెగ్యులర్ గా ఉపయోగించే వస్తువులలో అటు నేయిల్ కట్టర్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. గోర్లు పెరిగిన ప్రతిసారి కూడా ఇక నెయిల్ కట్టర్ తో కతరించుకోవడం.. తమకు నచ్చిన విధంగా గోర్లను షేప్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో నేయిల్ కట్టర్ తప్పకుండా ఉంటుంది. అయితే ఇలా నెయిల్ కట్టర్లను కొనుగోలు చేసినప్పుడు ఇక నెయిల్ కట్టర్ మధ్యలో రెండు కత్తిలాంటి ఉపకరణాలు వస్తాయి. అయితే చాలామందికి ఇవి ఎందుకు వస్తాయి.  వీటితో ఎలాంటి ఉపయోగముంటుంది. వీటి పనితీరు ఏంటి అన్న విషయం తెలియదు. ఆ విషయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం..



 సాధారణంగా నెయిల్ కట్టర్ ను గోర్లు కత్తిరించడానికి ఉపయోగిస్తారు అంతకుమించి దీనితో ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి నెయిల్ కట్టర్ ఉపయోగాన్ని పెంచేందుకు రెండు కత్తిలాంటి పరికరాలను దానికి జత చేస్తారట. ఇక దీంతో గోర్లు కత్తిరించుకోవడమే కాదు ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. చాలామంది గోర్లను శుభ్రం చేసుకోవడానికి ఇక చిన్న కత్తులను ఇచ్చి ఉంటారు అని భావిస్తూ ఉంటారు. అయితే ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు బాటిల్ మూత తెరవాలనుకుంటే ఇక నెయిల్ కట్టర్ లో ఉండే చిన్న కత్తి ఉపయోగపడుతుందట.



 నైల్ కట్టర్ లో ఉండే చిన్న వంగిన కత్తితో బాటిల్ క్యాప్ ను తెరవచ్చట. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు, నారింజలు లేదా మరేదైనా సులభంగా కత్తిరించేందుకు అవకాశం ఉంటుందట. కానీ చాలామంది ఇక ఇలా నేయిల్ కట్టర్ మధ్యలో ఉండ చిన్న కత్తితో గోర్లను శుభ్రం చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అది ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇక నెయిల్ కట్టర్ లో ఉండే చిన్న కత్తి పదునైన అంచులు వేలు గోర్లకి గుచ్చుకుని గాయం అయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: