చాలామందికి ఈ మధ్యకాలంలో జుట్టు సమస్యల కారణంగా ఊరికే జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అంతేకాక చుండ్రు,దురద వంటి జుట్టు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి.అలాంటి వారు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల,జుట్టు సమస్యలు తగ్గి, జుట్టు పొడవుగా దృఢంగా పెరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.ఈ ఆహారాలను పూర్వం రోజుల్లో ఎక్కువగా తినేవారని,అందువల్ల అప్పట్లో ప్రతిఒక్కరి జుట్టు పొడవుగా దృఢంగా ఉండేదని, పోషకాహార నిపుణులు సూచిస్తూన్నారు.జుట్టుకు అంతటి పోషణ అందించే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరి..

ఉసిరిని తరచూ తీసుకోవడం వల్ల,అందులోని విటమిన్‌ సీ,యాంటీ ఆక్సిడెంట్లు,మినరల్స్‌,అమైనో యాసిడ్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఈ పోషకాలన్ని జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి.ఉసిరి కాయలు సీజనల్గా వచ్చే పండ్లు.కనుక వీటిని ఊరగాయలాగా, లేదా ఎండబెట్టి పొడి చేసుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చు.ఇవి చుండ్రు,దురద వంటి సమస్యలను కూడా తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

నెయ్యి..

చాలామంది నెయ్యిలో అధిక కొలెస్ట్రాల్ ఉంటుందని తినకుండా ఉంటారు.కానీ ఆయుర్వేదంలో నెయ్యి ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.తరచూ నెయ్యి తీసుకోవడం వల్ల,అందులో ఉండే విటమిన్‌ డి,ఎ,ఇ జుట్టు సమస్యలను నివారిస్తాయి.రోజూ ఉదయం ఒక చెంచా మొతాదులో నెయ్యి తిసుకుంటే చాలా మంచిది.

గుడ్డు..

రోజుకో గుడ్డు తినడం వల్ల,అందులోని ప్రొటీన్‌,విటమిన్ బి12,ఐరన్,జింక్,ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కళంగా లభిస్తాయి.గుడ్డులో ఉన్న విటమిన్‌ A,E, బయోటిన్,ఫోలేట్ జుట్టు ఒత్తుగా,ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడతాయి.కావున రోజుకో గుడ్డు తినడం చాలా మంచిది.

కరివేపాకు..

కరివేపాకులో విటమిన్ సి,విటమిన్ బి,ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.ఈ పోషకాలు సెల్యులార్ పునరుత్పత్తికి దోహదం చేస్తాయి.అంతేకాక మాడుపై రక్తప్రసరణను ప్రోత్సహించి,జుట్టును బలంగా,ఒత్తుగా చేస్తాయి.

మునగాకు..

మునగాకులో విటమిన్ ఎ,B1 (థయామిన్),B2 (రిబోఫ్లావిన్),B3 (నియాసిన్),B-6, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సమస్యలు దరి చేరకుండా కాపాడుతాయి.కావున ఒత్తయినా జుట్టు కోసం, మునగాకు తీసుకోవడం ఉత్తమం.

బాదాం..

బాదాంలో కాల్షియం,సిలికా,విటమిన్ ఇ,జింక్, మెగ్నీషియం,బయోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి,జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: