ఆపిల్..
రోజుకో యాపిల్ తినండి డాక్టర్ ని దూరంగా ఉంచండి అని ఊరికే చెప్పారా పెద్దలు.ఇందులోని పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎంతో బాగా కాపాడుతాయి.ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ అధిక ఫైబర్,జీరో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల,ఇవి అందానికి,ఆరోగ్యానికి రెండిటికీ ఉపయోగపడతాయి. ఆపిల్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవడం వల్ల,ఇందులోనే ఉన్న విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బనానా..
రోజుకో అరటిపండు తినడం వల్ల,మన జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరస్తుంది.ఇందులో అధికంగా ఉన్న విటమిన్స్ మరియు మినరల్స్ ఆరోగ్యానికి కాక,అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అరటిపండుతో ఫేషియల్ చేసుకోవడం వల్ల,చర్మానికి తేమనందించి,మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది. మరియు మృత కణాలను తొలగించి ఓపెన్ పోర్స్ ఏర్పడకుండా సహాయపడుతుంది.
బొప్పాయి..
బొప్పాయి తీసుకోవడం వల్ల,మలబద్ధకం,గ్యాస్,అజీర్తి వంటి సమస్యలను తగ్గించుకోవడమే,ఇందులోని విటమిన్ ఏ కంటి సమస్యలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.మరియు బొప్పాయితో ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల,జిడ్డు సమస్యలు తొలగి ముఖం కాంతివంతంగా,మెరుస్తూ ఉంటుంది.
పుచ్చకాయ..
వేసవిలో అధికంగా లభించే పుచ్చకాయలో జీరో కొలెస్ట్రాల్ మరియు అధిక పోషకాలు కలిగి ఉంటాయి.కావున ఇవి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ పుచ్చకాయలతో ఫేస్ ప్యాక్ చేసుకోవడం వల్ల,చర్మం పొడిబారడం తగ్గి, మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది.