మామిడి పండ్లు..
వేసవి సీజన్లో దొరికే మామిడి పండ్లు అంటే చాలామందికి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.అలాంటివారు తీసుకునేటప్పుడే చాలా ఎక్కువగా పండ్లను తీసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని తింటూ ఉంటారు.కానీ ఇలా ఫ్రిడ్జ్ లో మామిడి పండ్లను నిల్వ చేసుకుని ఉంచుకోవడం వల్ల,అందులోని పోషకాలు తగ్గిపోతాయట.అలా ఒకవేళ నిల్వ చేసుకోవాలి అన్నా కూడా వాటిని కట్ చేసి గిన్నెలో మూత పెట్టి నిల్వ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే అవి ఫ్రిజ్లో పెట్టిన రకరకాల పదార్థాల నుంచి వచ్చే చెడు వాసనలన్నీ అబ్సార్బ్ చేసుకుని విషంగా మారే అవకాశం ఉందట.
పుచ్చకాయలు..
వేసవిసీజన్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉన్న పుచ్చకాయలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి అవి మిగిలినప్పుడు కట్ చేసి ఫ్రిజ్లో పెడుతూ ఉంటాము.ఇలా పెట్టడం వల్ల పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్ అన్ని తగ్గిపోవడమే కాకుండా మరియు టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది.అంతే కాక పుచ్చకాయకి ఇతర వాసనలను అబ్జర్బ్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది.కావున పుచ్చకాయలను కట్ చేసి అసలు నిల్వ చేసుకోకూడదు.
టమోటాలు..
టమాటాలను ఓపెన్ గా ఉంచి స్టోర్ చేసుకోవడంతో,అవి తొందరగా పాడవడమే కాకుండా,విషవాయువులని వెదజల్లే అవకాశం ఉంటుంది.కావున టమాటాలను కవర్లో ప్యాక్ చేసి,నిల్వ చేసుకోవడం ఉత్తమం.
చట్నీలు,పచ్చళ్ళు..
కొంతమంది మిగిలిపోయిన చట్నీలను,పచ్చళ్ళను కూడా ఫ్రిజ్‌లో పెడుతూనే ఉంటారు.ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల,అందులోని చల్లటి ఉష్ణోగ్రతలకు తొక్కులు తొందరగా పాడైపోతాయి.కావున పైన చెప్పిన వస్తువులన్నీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం మానేయడమే ఆరోగ్యానికి చాలా మంచిది.