ఈ రోజుల్లో  చాలా మంది కూడా బలహీనత, నీరసం, రక్తహీనత ఇంకా నిద్రలేమి వంటి సమస్యలతో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇంకా అలాగే కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం ఇంకా ఎముకలు గుల్లబారడం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పిన విధంగా పాయసాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల నీరసం ఈజీగా తగ్గుతుంది. ఇంకా శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. జుట్టు, చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదంపప్పు అలాగే ఫూల్ మఖనీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత కళాయిలో పాలు పోసి ఒక పొంగు వచ్చే దాకా ఉడికించాలి. ఇక ఇలా ఉడికించిన తరువాత పసుపు వేసి కలపాలి.తరువాత ఈ పాలను మరో నిమిషం పాటు మరిగించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి.ఇక దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత నానబెట్టుకున్న హాలిం సీడ్స్ ను వేసి కలపాలి.


ఈ పాయసాన్ని మరో 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఖర్జూర పండ్ల ముక్కలు ఇంకా యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.ఇక ఇలా చేయడం వల్ల హెల్తీ పాయసం ఈజీగా తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తప్ప ఈ పాయసాన్ని ఎవరైనా తినవచ్చు. ఈ పాయసాన్ని వారానికి రెండు సార్లు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా రక్తహీనత కూడా తగ్గుతుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.అలాగే నీరసం దరి చేరకుండా ఉంటుంది. మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి.అందుకే బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో వాడిన హలిం సీడ్స్ డ్రై ఫ్రూట్ షాపుల్లో ఇంకా ఆన్ లైన్ లో చాలా సులభంగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: