ప్రతి సీజన్లో ఏదో ఒక రకమైన పండు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పండ్లు అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అంతేకాదు వీటిలో అనేక రకాల పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇక వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కాబట్టి ప్రతి సీజన్లో వచ్చే పండును మిస్ కాకూడదు అని నిపుణులు సైతం చెబుతూ ఉంటారు. ఇక అలా అందరూ ఇష్టపడే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది. పైనాపిల్లో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల 100 గ్రాముల నుండి 50 గ్రాముల క్యాలరీలు మాత్రమే మనకు లభిస్తాయి.

క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారు కాబట్టి క్యాలరీలు తక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు కేలరీలను అందించకుండా చూడవచ్చు. అంతేకాదు ఇందులో ఫైబర్ కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాములకు 2.3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. వీటిని తినడం వల్ల ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. ఫలితంగా బరువు త్వరగా తగ్గవచ్చు. ముఖ్యంగా పైనాపిల్ లో బ్రోమోలైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల జీవక్రియ రేటును పెంచుతుంది.

అధిక జీవక్రియ రేటు ఉంటే శరీరం క్యాలరీలను వేగంగా కరిగించి వేస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ సమ్మేళనాలు ఉన్నాయి కాబట్టి శరీరంలో మంటను కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు విషయానికి వస్తే విటమిన్ సి, విటమిన్ బి1,  విటమిన్ b6 ,పొటాషియం లాంటి కణజాలు ఎక్కువగా ఉన్నాయి.  శరీరంలో నీటి నిలుపుదల ఉబ్బరం బరువు పెరగడానికి కారణం కావచ్చు.. కాబట్టి పైనాపిల్ తినడం వల్ల శరీరంలో నీటి నిలుపుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: