ఈ మధ్యకాలంలో చాలా మంది తిండే పరమావదిగా భావించి ఎప్పుడు తింటూనే ఉంటారు.మరీ ముఖ్యంగా వారి ఇష్టమైన బిర్యాని,జంక్ ఫుడ్ కనపడగానే తహతహలాడుతూ పొట్ట నిండా లాగించేస్తూ ఉంటారు. దానితో వారికి సంతోషం కలిగినా కూడా ఇలాగే కొనసాగిస్తే చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.ఇలా తరచూ తింటూ పోతే,వారి శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అస్సలు అలా ఎందుకు తింటారు వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

చాలామంది అతిగా తింటూ ఉండడానికి కారణం వారి శరీరంలో పోషకాలు సరిగా అందకపోవడమైనా కావచ్చు..లేదా కార్బోహైడ్రేట్స్ అధికమైనప్పుడు కూడా ఆకలి లేకున్నా సరే తింటూ ఉంటారు.దీనితో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు వస్తుంటాయి కూడా.. ఇందులో ముఖ్యంగా..

ఊబకాయం..
ఇలా తరచూ తింటూనే ఉండడం వల్ల,మన శరీరానికి కావాల్సిన పోషకాలు కన్నా అధిక పోషకాలు అంది,మన శరీరం జీర్ణించుకోలేక చెడు కొవ్వుల రూపంలోస్టోర్ చేసి పెట్టుకుంటుంది.దీనివల్ల ఉబకాయం కలిగి,ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.కావున ఇలాంటి సమస్యలతో బాధపడేవారు,తిండి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

అధిక గ్యాస్..
మన శరీరం తిన్నది సరిగా జీర్ణం చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది.ఆ సమయంలో కూడా మనం తింటూ పోతే,తిన్నది అసలు జీర్ణం కాదు.ఇలా జీర్ణం కానీ ఆహారం రెండు మూడు రోజులు మన పొట్టలోనే ఉండిపోతే,గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది.ఈ గ్యాస్ తో గుండెల్లో మంట,మలబద్ధకం వంటివి చోటు చేసుకుంటాయి కూడా..

అలసట..
ఎక్కువగా ఆహారం తీసుకునే వారిలో అలసట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.వారు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక,శక్తి రిలీజ్ కాదు.దానితో వారు తొందరగా అలసట చెందుతారు.

అతి నిద్ర..
అధిక ఆహారం తీసుకునే వారిలో అతి పెద్ద జబ్బు అయినా అతినిద్ర వస్తుంది.దీనివల్ల మన శరీరం జీవక్రియ రేటు తగ్గి,ఎన్నో వ్యాధులు మనకి తెలియకుండానే చుట్టుముడతాయి.

డిప్రెషన్..
అతిగా తినడం వల్ల అధిక బరువు కచ్చితంగా పెరిగి ఆత్మన్యూనత భావం కలుగుతుంది.దానితో ఒత్తిడి పెరిగి,డిప్రెషన్ లోకి వెళ్లి పోతారు.కావున ప్రతి ఒక్కరూ సరైన ఆహారాన్ని,సరైన సమయాలు పాటించి తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

FAT