సాధారణంగా చాలామంది పుట్టిన ప్రతి పిల్లలకు కళ్ళకు పాటతో పెట్టడం వల్ల అందం పెరుగుతుంది మరియు కళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని భావిస్తూ వుంటారు.పూర్వకాలం నుంచి వచ్చిన ఆనవాయితీ కూడా.. ఇప్పుడున్న డెర్మటాలజిస్టులుచేసిన పరిశోదనల ప్రకారం కళ్ళకు కాటుక అసలు పెట్టకూడదని వాదిస్తూ వున్నారు.దానికి కారణాలేంటో మరియు వాటి నుంచి కలిగే దుష్ప్రభావాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

పెద్దలు పిల్లలకు కాటుక పెట్టడానికి సగ్గుబియ్యాని బాగా వేయించి,బొగ్గు లాగా తయారు చేసేవారు.వాటిని బాగా వేయించి,రుబ్బి పొడిలా తయారుచేసేవారు.అలా తయారు చేసిన పొడిలో తగినంత నెయ్యి వేసి కాటుకలా సాధేవారు.ఇది పిల్లలకు పెట్టడం వల్ల బొట్టు మరియు కళ్ళకు అద్దడంతో,వారికీ అందాన్ని ఇవ్వడమే కాకుండా కళ్ళలో ఏమైనా నలుతపడినా కూడా తొందరగా బయటికి వస్తుందని, అదే ఎక్కువగా వాడేవారు.కానీ ఇప్పుడున్న కెమికల్ ప్రొడక్ట్స్ తో తయారు చేసే కాటుక మరియు ఐలైనర్,కాజల్ వంటి వాటి వల్ల పిల్లల కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, ఇందులో ఎక్కువగా సీసంతో తయారు చేస్తూ ఉన్నారని నిర్మటాలజిస్టు చెబుతున్నారు.దీనిని తరచూ వారి కళ్ళకి ఆ సీసంతో తయారుచేసిన కాటుక అప్లై చేయడం వల్ల, వారి కంటిపై ఉన్న సున్నితమైన పొర దెబ్బతిని,కంటి ఆరోగ్యం దెబ్బతింటుందట.మరియు పెద్దలు కాటుక పెట్టేటప్పుడు వారి చేతి శుభ్రతను గమనించకుండా పెట్టడం వల్ల కూడా కంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తూ వున్నారు.

అంతేకాక పిల్లలకు కాటుక బొట్టు పెట్టడానికి కూడా కాటుక వాడుతూ వున్నారు.కానీ పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శరీర తత్వం ఉంటుంది.దానితో వారికి ఆ కాటుకలోని సీసం చర్మ సమస్యలను కలిగించి,తెల్ల మచ్చలను ఏర్పరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కావున ఎవరైనా కాజల్ అప్లై చేయాలి అనుకునేవారు పూర్వం కాలం పద్ధతి పాటించడమే ఉత్తమమనీ డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.మరియు చేతి శుభ్రతను కూడా తప్పకుండా గమనించుకోవాల్సిందే..ఇవన్నీ తల్లి గమనిస్తూ బిడ్డ ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రొడక్ట్స్ వాడడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: