రకరకాల సీజన్లో దొరికే పండ్లను తిని,వాటి గింజలను పడేస్తూ ఉంటాము.కానీ ఈ కాయలు తినడం కన్నా వాటిలో ఉన్న గింజలను తినడం వల్లే,ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.వాటి గింజలను పొడి చేసుకొని తరచూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం, గుండె జబ్బులను సైతం దూరం చేయడానికి ఉపయోగపడతాయట.ఇంతటి ప్రయోజనాలు కలిగిన గింజలు ఏంటో మనమూ తెలుసుకుందాం పదండి..

గుమ్మడి గింజలు..

సాధారణంగా గుమ్మడికాయలో విటమిన్ ఈ,ఏ మరియు జింక్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి.కానీ గుమ్మడికాయ కంటే గింజల్లోనే అధిక పోషకాలు కలిగి ఉంటాయట.ఇందులో పుష్కలంగా లభించే మెగ్నీషియం గుండె కండరాలను బలపరిచి గుండె జబ్బులు చేరకుండా కాపాడుతుంది.

నేరేడు విత్తనాలు..

మధుమేహం ఉన్నవారికి నేరేడు కాయలు ఒక వరం అని చెప్పవచ్చు.కానీ ఇందులోని గింజలు కాయలు కన్నా ఎక్కువ ప్రయోజనాలను చేకూరుస్తాయట. మధుమేహంతో బాధపడేవారు నేరేడు గింజలతో తయారు చేసిన పొడి వాడటం వల్ల,ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగేలా దోహదపడతాయి.ఇవి సీజనల్గా దొరికే పండ్లు కాబట్టిదొరికినప్పుడే,వీటి విత్తనాలతో పొడి చేసి నిల్వ ఉంచుకొని,వాడుకోవడం చాలా మంచిది.

పనస గింజలు..


పనసలో ఫోలేట్‌, నియాసిన్‌, పొటాషియం,మెగ్నీషియం, మాంగనీస్‌,ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి..వీటిని ఉడకబెట్టి తీసుకోవడంతో జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు దోహదపడి,మలబద్ధకాన్ని దరి చేరనివ్వదు.దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌-సి అధికంగా ఉంటుంది.అంతేకాక ఈ గింజల్లో లభించే ఇనుము రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

కాకర విత్తనాలు..

కాక‌రకాయ కన్నా గింజలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి రోగనిరోధ‌క శ‌క్తిని పెంచి, సీజనల్ గా వచ్చే రోగాలను దరిచేరనివ్వవు.ఈ గింజల పొడిని రోజూ తీసుకోవడంతో కడుపులో ఉన్న నులిపురుగులు,ఇతర క్రిములను తొందరగా నశిస్తాయి.ఈ గింజలు పొడి వల్ల శ‌రీరంలో చెడు కొవ్వులు క‌రిగి,మంచి కొవ్వులు పెరుగుతాయి.అంతేకాక మలేరియా,టైఫాయిడ్,కామెర్లు వంటి బ్యాక్టిరియా,వైరస్ వ్యాధులు కూడా రాకుండా సహాయపడతాయి.

దోస విత్తనాలు..

దోసకాయలు కన్నా వాటి విత్తనాల్లో అధిక పైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.అంతేకాక విటమిన్ బి,సి,కాపర్,ప్రోస్పరాస్,పొటాషియం,మెగ్నీషియం, వంటివి పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.కావున ఈసారి కాయలు తిని,విత్తనాలే కదా అని పడేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: