ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా కలిగిన దేశం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా భారతదేశం పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే హిందూ పురాణాల్లో ఉన్న కథలు అన్నీ కూడా  భారత్ గురించి ఉంటాయి.  అంతేకాదు ఇండియా ని హిందుస్థాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే ప్రపంచ ప్రజానీకం మొత్తం ఎక్కువ హిందూ జనాభాను కలిగిన దేశం కేవలం భారత్ మాత్రమే అని భావిస్తూ ఉంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే భారత్ కంటే ఎక్కువగా హిందూ జనాభా కలిగిన దేశం మరొకటి ఉందట. హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల లిస్ట్ చూస్తే భారత్ రెండవ స్థానంలో ఉంది అన్నది తెలుస్తుంది.



 అయితే భారత్లో పెద్ద వర్గం హిందూ మతాన్ని నమ్ముతూ ఉంది. భారత జనాభాలో 80 శాతం కంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. నివేదికల ప్రకారం 966.3 మిలియన్ల మంది హిందువులు ఇండియాలో ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో  79 శాతం కంటే ఎక్కువే. కానీ ఇంతకు మించిన శాతం ఉన్న దేశం మరొకటి ఉందట. అదేదో కాదు భారత్ పొరుగున ఉన్న నేపాల్ దేశం. నేపాల్ లో ఉన్న జనాభా శాతం పరిశీలిస్తే ఎక్కువ సంఖ్యలో హిందువులే ఉన్నారట. మొత్తం జనాభాలో 81% కంటే ఎక్కువ మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు.


 సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకటించిన నివేదిక ప్రకారం... 2021 జనాభా లెక్కలు పోల్చి చూస్తే నేపాల్లో 81.9 శాతం మంది హిందువులు ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే భారత్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి పూర్తి జనాభాలో శాతాన్ని చూస్తే మాత్రం హిందువులు శాతం భారత్ కంటే ఎక్కువగా ఉంది అన్నది తెలుస్తుంది. అయితే నేపాల్ తర్వాత మరో దేశం ఎక్కువ హిందువుల జనాభా కలిగిన దేశంగా మూడో స్థానంలో ఉంది. అదేదో కాదు మారిషన్. ఈ దేశంలో 48.4% మంది హిందువులు ఉన్నారట. ఇక ఆ తర్వాత స్థానాల్లో లిజీ 27.9, గయాన 23.3, భూటాన్ 22.5, టొబాకో 18.2, ఖతార్ 15.1, శ్రీలంక 12.6, కువైట్ 12, బంగ్లాదేశ్ 8.5, మలేషియా 6.3, సింగపూర్ 5.0, యూఎస్ 5.0, ఒమన్ 3.0 శాతం మంది హిందువులు ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: