ఈ డై కోసము హెన్నా పౌడర్ పెట్టుకోవడం సర్వసాధారణమే కానీ.సహజంగా దొరికే గోరింటాకు పొడితో జుట్టు ఎర్రగా మారి పీచులాగా తయారవుతూ ఉంటుంది.దానికోసం ఈ చిట్కా బలే బాగా ఉపయోగపడుతుంది.ముందుగా ఒక బాండి తీసుకొని, అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఎండబెట్టిన గోరింటాకు పొడి,ఒక స్పూన్ ఉసిరి పొడి,గుప్పెడు బృంగరాజ్ ఆకులు వేసి బాగా వేయించుకోవాలి.ఇది బాగా నల్లగా మారిన తర్వాత,అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి మరిగించుకోవాలి.ఇలా బాగా మరిగిన తర్వాత దించి 6 నుంచి 7 గంటల సేపు అలాగే ఉంచాలి.
ఇలా నిల్వ ఉంచుకున్న మిశ్రమాన్ని తలస్నానం చేసుకునే ముందు తలకు బాగా అంటించి,గంటసేపు ఆరనివ్వాలి.ఆ తరువాత మైల్డ్ షాంపూ తో శుభ్రం చేసుకోవాలి.ఇలాంటి చిట్కాలు పాటించిన సమయంలో జుట్టు హార్డ్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది.కావున జుట్టుకు మాయిశ్చరైజర్ కానీ,సీరమ్ కానీ రాయడం చాలా ఉత్తమం.ఇలా చేయడంతో డై ఎక్కువ రోజులు పాటు ఉండడమే కాకుండా,జుట్టు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.అంతే కాక జుట్టు ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవడం,సరైన నిద్ర,నీరు ఎక్కువ తాగడం వంటివి అలవాటు చేసుకోవాలి.