యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడంతో కీళ్లనొప్పులు రావడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడి,ఇంకోన్ని వ్యాధులు పెరిగే అవకాశాలు ఉంటాయి.అంటే యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోయి,సాలిడ్స్ లా మారి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి.కావున enయాసిడ్‌ను వీలైనంత తొందరగా నియంత్రించడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా పని చేస్తాయి.మరి ఈ ఆకులను ఎలా వాడాలో మరియు వాటి వల్ల ప్రయోజనాలను తెలుసుకుందాం పదండీ..
తమలపాకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల అసౌకర్యం మరియు నొప్పిని చాలా వరకు తగ్గిస్తాయి.అంతేకాక రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు బోలు ఎముకల వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా నివారణ కలిగిస్తుంది.
దీనికోసం రోగులు రోజూ ఉదయాన్నే తమలపాకును నమలి, ఆ రసాన్ని మింగాలి. ఇలా తరుచూ చేయడంతో యూరిక్ యాసిడ్ స్పటికలా స్థాయిలను కరిగించి,యూరిన్ రూపంలో బయటికి పంపించేస్తుంది.అయితే తమలపాకు తినేటప్పుడు పొగాకు మాత్రం అస్సలు వాడకూడదు దాని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంతేకాక రోజు తమలపాకులను తినడం వల్ల, ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు,నోటిలోని అనేక బ్యాక్టీరియాలతో ప్రభావవంతంగా పోరాడి దంతాలను శుభ్రపరుస్తాయి.మరియు భోజనం చేసిన తర్వాత కొద్దిగా తమలపాకును నమలడం వల్ల పొట్టను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నోటి దుర్వాసనను పోగొడతాయి.పంటి నొప్పి,చిగుళ్ల నొప్పులు,వాపులు, నోటి ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
తమలపాకులు తినడంతో పేగులలో ఏర్పడే అపానవాయువును నివారించడంలో సహాయపడతాయి.మరియు జీవక్రియ రేటును కూడా పెంచుతాయి.ప్రేగులు విటమిన్లు మరియు పోషకాలను తొందరగా శోషించడానికి సహాయపడతాయి.
ఇందులో రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది.ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడి,అనియంత్రిత రక్తంలో గ్లూకోజ్ వల్ల కలిగే మంటను తగ్గించడానికి సహాయపడతాయి.కావున ప్రతి ఒక్కరూ రోజుకో తమలపాకు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.