సాధారణంగా బయట వర్షం పడుతుంటే వేడివేడి మొక్కజొన్నలకు ఉప్పు, కారం , నిమ్మకాయ పెట్టి తినాలనే ఆలోచన తప్పకుండా వస్తుంది. ఎందుకంటే వాతావరణం అలాంటిది.. నోటికి రుచి తగలాలంటే ఆ మాత్రం తినాల్సిందే.ముఖ్యంగా మొక్కజొన్న పేరు చెప్పగానే తినాలనిపించే అంత రుచి దాని సొంతం. ముఖ్యంగా వర్షాకాలంలోనే ఎక్కువగా లభించే ఈ మొక్క జొన్నలు కేవలం స్నాక్ లాగా మాత్రమే తీసుకోకుండా ఇందులో దాగి ఉన్న పోషకాలు గురించి కూడా తెలుసుకుంటే వీటిని తప్పకుండా తినడానికి ఇష్టపడతారు.

ముఖ్యంగా సీజన్ ని బట్టి మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయి కాబట్టి అప్పుడు తింటేనే వీటి మజా మనకు తెలుస్తుంది. ఇకపోతే మొక్కజొన్న పొత్తులలో మనకు ఎలాంటి పోషకాలు లభిస్తాయి అనే విషయానికి వస్తే.. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ b6, థయామిన్, పొటాషియం,  మెగ్నీషియం, జింక్, మాంగనీస్ , ఫోలేట్,  ఫైబర్, 28 క్యాలరీల శక్తి 1.4 గ్రాముల కొవ్వు, 9.4 గ్రాములు ప్రోటీన్, 19 గ్రాముల కార్బోహైడ్రేట్స్, కాపర్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇకపోతే మొక్కజొన్న తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.  ఫలితంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

ఇక మొక్కజొన్నలో ఉండే పోషకాల కారణంగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. మొక్కజొన్నను వీలైనంత తరచూ తింటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ సమస్యను కూడా నియంత్రించుకోవచ్చు. మొక్కజొన్నలు తినడం వల్ల చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వడమే కాకుండా ముడతలు,  వృద్ధాప్య ఛాయలు కూడా దూరం అవుతాయి. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను దూరం చేయడమే కాదు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. మొక్కజొన్నలు పిల్లలు కూడా తినడం వల్ల వారిలో మంచి ఎదుగుదల కనిపించడమే కాదు వారు బలంగా,  మంచి బరువుతో పెరుగుతారు. అయితే మొక్కజొన్న తినేటప్పుడు పూర్తిగా ఉడికించి ఉప్పు, కారం,  నిమ్మకాయ వంటివి లేకుండా మాత్రమే తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: