దీనికోసం ముందుగా ఒక మైసూర్ శాండిల్ సోప్ తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ లాంటి మందంపాటి గిన్నె పెట్టి నీళ్లు వేసి, వేరొక గిన్నెలో మైసూర్ శాండిల్ ముక్కలు వేసి ఆవిరితో కరిగించాలి.ఇది బాగా కరిగిన తర్వాత ఇందులో ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్,రెండు టేబుల్ స్పూన్ల పాలు,ఒక స్పూన్ అలోవెరా జెల్,ఒక స్పూన్ బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయాలి.ఇలా బాగా మిక్స్ అయిన పదార్థాన్ని మౌల్డ్స్ లో వేసి అరగంటసేపు ఫ్రిజ్లో ఉంచాలి.మరియు అది మరొక సోప్ లాగా మారిపోతుంది.వీటిని నెల రోజులపాటు తాపీగా వాడుకోవచ్చు.
ఇలా మారిన తరువాత ఈ సోప్ తోనే రోజూ ముఖాన్ని మెల్లగా మర్దన చేస్తూ క్లీన్ చేసుకోవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్,మొటిమలు,మచ్చలు,మృత కణాలకు వారంలోగా ఉపశమనం కలిగి మొఖం మెరుపు సంతరించుకుంటుంది.ఇందులో వాడిన బియ్యం పిండి వల్ల ముఖంపై ఉన్న మృత కణాలు మరియు అన్ వాంటెడ్ హెయిర్ ఈజీగా తొలగించుకోవచ్చు.మరియు ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ సింపుల్ చిట్కా బలే ఉపయోగపడుతుంది.దీనితోపాటు సరైన నిద్ర,సరైన ఆహారం,సరైన క్వాంటిటీలో నీరు తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్సైజ్, యోగా వంటివి అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.