నల్ల ద్రాక్షలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి కండరాల ఎముకలు మృదుల స్థితి పెరుగుదలకు చాలా సహాయపడుతుందట. అలాగే రక్తంలోని పీహెచ్ స్థాయిని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి.
నల్ల ఎండు ద్రాక్షాను తరచూ అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల కళ్లకు మేలు చేస్తాయి. ఇందులో విటమిన్స్, పాలి పెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల కళ్ళను ఫ్రీ రాడికల్ డామేజ్ నుండి రక్షిస్తాయి. అయితే కంటిసుక్లం, గ్లాకోమా ప్రమాదం నుంచి కాపాడుతాయట.
నల్ల ఎండు ద్రాక్షను రాత్రివేళ నానబెట్టి ఉదయం తిన్నట్లు అయితే మరింత ఉపయోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రే చీకటితో బాధపడేవారు వీటిని తగ్గిస్తుందట.
ముఖం పైన ఉండేటువంటి మొటిమలు రాకుండా ఎండుద్రాక్ష నివారిస్తుంది ముఖ్యంగా చర్మం పైన ఉన్న రంధ్రాలను తగ్గిపోయేలా చేస్తుందట.
ఎక్కువగా ఎవరికైనా జుట్టు రాలుతున్నట్లు అయితే ఎండు ద్రాక్షలను మూడు నెలలపాటు తింటే కచ్చితంగా జుట్టు పెరుగుతుందట. అంతేకాకుండా చర్మం బలంగా మారడంలో కూడా ఈ నల్ల ద్రాక్ష చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది ఇందులో ఉండే దినము విటమిన్స్ క్యాల్షియం ఎక్కువగా వీటన్నిటిని సమృద్ధిగా కాపాడుతాయట.
నల్ల ద్రాక్షల ఐరన్ విటమిన్స్ కాంప్లెక్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఎవరైనా రక్తహీనతతో బాధపడేవారు ఈ నల్ల ద్రాక్షను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది.
ఎండుద్రాక్ష లో ఉండే ఐరన్ వల్ల చర్మం తెల్లగా నిగనిగా లాడుతూ ఉంటుందట. అయితే షుగర్ పేషెంట్లు మాత్రం వీటిని వైద్యులను సంప్రదించిన తర్వాతే తినడం మంచిది.