చెమట రావడం అనేది ప్రతి ఒక్కరికి మంచిదే..కానీ అతిగా చెమటలతో ఇబ్బంది పడుతున్న వారు పలు అనారోగ్య సమస్యలకు ఇది సంకేతం అని చెప్పవచ్చు. అయితే ఇందులో అతిగా చమట పట్టడానికి తగ్గించుకోవడానికి పలు చిట్కాలను పాటిస్తే సరిపోతుందని పలువురు నిపుణులు తెలుపుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.


ఆహారంలో ఉప్పును అధికంగా ఉపయోగించడం వల్ల ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మన శరీరానికి తొందరగా చెమటలు పడతాయని ఒక అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. దీంతో ఉప్పును అతిగా తినకపోవడం మంచిదంటూ వైద్యులు సైతం సూచిస్తున్నారు.


ఆల్కహాల్ ని సైతం అతిగా తాగే వారిలో చెమట సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందట. ఆల్కహాల్ శరీరంలో నీటిని తొందరగా చెమట రూపంలో నుంచి బయటికి పంపెలా చేస్తుంది. అందువల్ల వీటిని తక్కువగా తాగడం మంచిది.


చెమట అధికంగా పట్టేవారు ఫైబర్ ఆహారాలను తీసుకోవడం చాలా ఉత్తమము ఇందులో ఆకుకూరలు తాజా కూరగాయలు వంటివి తినడం అలవాటు చేసుకోవాలి.


కాఫీ టీ వంటి వాటిలో ఎక్కువగా కెఫిన్ అనే పదార్థం ఉంటుంది దీని వల్ల కూడా అతిగా చెమటలకు ఎక్కువగా కారణమవుతుంది. అందువల్లే ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ గ్రీన్ టీ ని తాగడం మంచిది దీనివల్ల గుండె కూడా ఆరోగ్యంగా


చెమట అతిగా ఉందని వాటర్ తాగడం మర్చిపోకూడదు..చెమట వల్ల కోల్పోయిన ఎన్నో లవణాలను సైతం నీరు తిరిగి పొందేందుకు సహాయపడుతుంది.అందువల్లే ఎక్కువగా నీటిని తాగడం మరిచిపోకూడదు.


నూనె ఎక్కువగా ఉపయోగించే పదార్థాలు తినడం వల్ల కూడా చెమటలు అతిగా వేస్తాయట.అందువల్లే జంక్ ఫుడ్ వంటి వాటిని చాలా తగ్గిస్తే మేలని నిపుణులు తెలుపుతున్నారు.


ఎక్కువగా స్ట్రెస్ కు గురి కావడం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది. అలాంటి సమయంలో కాస్త వ్యాయామం చేయడం వల్ల చాలా మంచిది.


మరి కొంతమందిలో అకస్మాత్తుగా చెమటలు పట్టడం వల్ల గుండెపోటుకు కారణం అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: