కంచు పాత్రలలో ఆహారాన్ని తింటే ఆహారంలో ఉండే విష పదార్థాలను సైతం గ్రహించుకొని శక్తి వాటికి ఉంటుందట. అలా ప్లేట్ లో ఉన్నటువంటి ఆహారం మలినాలను తొలగించి ఆ తర్వాత ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందట.
కంచు గ్లాసులోని నీటిని తాగితే అధిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు కాస్త ఒత్తిడి తగ్గినట్టుగా అనిపిస్తుందట.
కంచు ప్లేట్లో బోజనం చేయడం వల్ల ఇతరత్న మలినాలను కలిగి ఉండకుండా ఇందు లో తినడం వల్ల ఇది సులువుగా జీర్ణం అవుతుందట. దీనివల్ల జీర్ణ సమస్యకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ప్రతిరోజు కంచు ప్లేట్లో భోజనం చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.. ఎలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఇబ్బంది కలగకుండా ఉంటుందట.
కంచు ప్లేట్ లోని వాటిని మనం తరచూ తింటూ ఉండడం వల్ల.. కంచు లో ఉండే రాగి చెడు కొవ్వును సైతం కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. దీంతో బరువు సులువుగా తగ్గవచ్చట.
కడుపులో మంట నొప్పి ఇతరత్రా సమస్యలకు సైతం కంచు చెంబులోని నీటిని తాగడం వల్ల వెంటనే ఉప శమనం కలిగిస్తాయట.
కంచు సామాగ్రిలలో తయారు చేసేటప్పుడు ఎక్కువగా కాపర్ ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లెవ్వాల్స్ ను కూడా పెంచేలా చేస్తాయి.ఆ తర్వాత రక్తహీనత సమస్యకు సైతం చెక్ పెట్టేలా చేస్తాయి.