తీవ్రమైన జ్వరం దగ్గుతో బాధపడేవారు ఒక గ్లాసు పాలలో చిటికెడు సొంటి వేసి ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల వాటికి తొందరగా ఉపశమనం కలుగుతుంది.ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అంతేకాక అధిక జలుబు తీవ్రమైన కఫంతో బాధపడే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనిని పిల్లలు తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు.కానీ అలాంటి వారికి తేనెతో కలిపి రోజుకు ఒక ముద్ద తినిపించడం వల్ల కూడా వారికి రోగనిరోధక శక్తి పెరిగి,జ్వరం దగ్గు జలుబు తొందరగా తగ్గిపోతాయి.
తీవ్రమైన ఉబ్బసం,అస్తమా,ముక్కు దిబ్బడ,తలబారం వంటి సమస్యలతో బాధపడేవారికి శోంఠి,మీరియాలు, తేనే కలిపి తీసుకోవడంతో వాటికీ చిటికెలో ఉపశమనం దొరుకుతుంది.
అంతేకాక సొంటిని తరచూ తీసుకోవడం వల్ల,సీజనల్ వ్యాధులే కాక దీర్ఘకాళిక రోగాలైన గుండె జబ్బులు,కిడ్నీ సమస్యలు,ఊపిరితిత్తుల సమస్యలను కూడా దరిచేరకుండా కాపాడుతుంది.మరియు చెడు రక్తాన్ని శుభ్రం చేయడంలో కూడా సహాయపడి, బ్లడ్ క్లాట్ అవడం రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఎవరైనా తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతూ ఉంటే, ఇలాంటివారు చిటికెడు సొంటి తీసుకొని,చిటికెడు లవంగాల పొడి,చిటికెడు మిరియాల పొడి కలిపి,నీళ్లు వేసి చిన్న ముద్ద లాగా తయారు చేసుకుని,పంటికింద పెట్టుకోవడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే తొందరగా శోంఠిని ఉపయోగించడం మొదలుపెట్టండి.