సాధారణంగా యువతి యువకుల మధ్య ప్రేమ పుట్టడం సహజం. ఏదో ఒక సమయంలో ఒకరి పట్ల ఒకరు ఆకర్షణకు గురి కావడం జరుగుతూనే ఉంటుంది. మీ లైఫ్ లో కూడా ఇది జరిగే ఉంటుంది. కొంతమందికి స్కూల్ డేస్ లోనే క్రష్ ఉంటే ఇంకొంతమందికి కాలేజీ డేస్ లో ఇలా ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఇక నేటి రోజుల్లో అయితే లవ్ స్టోరీ లేని స్టూడెంట్ లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంకొంతమంది ఇక ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో ప్రేమలో పడిపోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రేమలో పడినవారు ప్రపంచాన్ని మరిచిపోయి సైతం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని ఎంతో మంది ప్రేమికులే చెబుతూ ఉంటారు. సినిమాల్లోనూ ఇదే చూపిస్తారు.



 ఇలా యువతి యువకుల మధ్య పుట్టిన ప్రేమ జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో మధురానుభూతులను అందిస్తుంది అని ఎన్నో కొటేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇలా సాఫీగా సాగిపోతున్న ప్రేమకు బ్రేక్ పడితే ఇక ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు బ్రేకప్ చెబితే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఇలాంటి బ్రేకప్ల కారణంగానే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొంతమంది పిచ్చి వాళ్ళలా కూడా మారిపోతున్నారు. మరి కొంతమంది ప్రేమించిన వారి మీదే పగ పెంచుకొని హత్యలు కూడా చేస్తూ ఉన్నారు.


 దీంతో బ్రేకప్ అస్సలు మంచిది కాదు అని అంటుంటారు జనాలు. కానీ ప్రేమలో బ్రేకప్ అనేది మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే బ్రేకప్ వల్ల మన గురించి మనం పునరాలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుందట. మనకు రాబోయే వ్యక్తి ఎలాంటి వారైతే మనకు సెట్ అవుతారు అనే విషయంలో స్పష్టత వస్తుందని బిహేవియరల్ సైన్సెస్ నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు మనలో మనకే తెలియని కొత్తకోనాన్ని బ్రేకప్ మనకు పరిచయం చేస్తుందట. అన్నిటికంటే ముఖ్యంగా బ్రేకప్ వల్ల మనలోని లోపాలు తెలుస్తాయట. తద్వారా మనల్ని మనం సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: