ఎక్కువగా గ్రామాలలో దొరికేటువంటి వాటిలో చింతాకు కూడా ఒకటి.. ఎక్కువగా చింతపండు గురించి మాత్రమే పట్టించుకుంటూ ఉంటారు. కానీ చింత చిగురు వల్ల కూడా బాగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని చాలా తక్కువ మొత్తంలో ఉపయోగిస్తూ ఉన్నారు ప్రజలు. చింత చిగురు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు. అయితే వేజ్ నాన్ వెజ్ వంటకాలలో రుచి కోసం ఎక్కువగా చింతచిగురుని ఉపయోగిస్తూ ఉంటారట.. అలాగే ఈ చింతచిగురుని ఎండబెట్టి నిల్వ చేసుకోవడం కూడా జరుగుతుంది..



చింతాకు పొడి వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది కేవలం రుచి మాత్రమే కాకుండా చింతాకు వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. చింతచిగురు కాస్త లేతగా ఉన్న వాటిని తీసుకొని పప్పులు లేకపోతే చట్నీని చేసుకుని తింటే పలు పోషకాలు కూడా అందుతాయట. ఇందులో ముఖ్యంగా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రక్తహీనతతో ఇబ్బంది పడే వారిని ఎక్కువగా చింతాకు లేదా పుల్లగా ఉండే వాటిని తినమని సలహా ఇస్తూ ఉంటారు వైద్యులు. ఈ చింతాకు చిగురుతో వంటలు పిల్లలకు చేసి పెట్టడం వల్ల వారు చాలా దృఢంగా తయారవుతారు.

కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారు ఈ చింతచిగురుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. తటిక బెల్లంతో చింతాకు రసాన్ని కలిపి ఇస్తే దివ్య ఔషధంగా పనిచేస్తుంది కీళ్లనొప్పితో ఇబ్బంది పడేవారు కూడా తరచూ అప్పుడప్పుడు వీటిని తినడం మంచిది. గొంతు ఇన్ఫెక్షన్ నొప్పితో ఇబ్బంది పడేవారు చింతచిగురు చాలా ఉపయోగపడుతుంది.. వర్షాకాలంలో ఇది చాలా ఎక్కువగా దొరుకుతుంది అందుకే ఆ కాలంలో ఖచ్చితంగా వీటిని తినడం మంచిది. థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు చింతచిగురుని తినడం వల్ల వాటి నుంచి ఉపశమనాన్ని సైతం పొందవచ్చు.ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వుని సైతం తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: