దీనికోసం ముందుగా ఒక స్ఫూన్ టేబుల్ స్పూన్ల కర్పూరం పొడి,మూడు టేబుల్ స్ఫూన్ల కొబ్బరి నూనె,రెండు లేదా మూడు నిలగిరి ఆకులు,ఒక స్పూన్ అజ్విన్ వేసి,బాగా మరిగించి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి.దీనిని సాధారణ జండుబాం అప్లై చేసుకున్నట్టు చెస్ట్ పైన,తలకు అరికాళ్లలో గంటకొకసారి మర్దన చేయాలి.ఇలా రెండు రోజులపాటు చేస్తే చాలు వెంటనే జలుబుకు ఉపశమనం కలుగుతుంది.
దీనితోపాటు పిల్లలకు ఒక స్పూన్ తేనె తీసుకుని, అందులో చిటికెడు పసుపు,మూడు నాలుగు చుక్కల అల్లం రసం వేసి బాగా కలపాలి.ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక సీసాలో నిలువ ఉంచుకోవచ్చు.దీనిని రోజుకు మూడు పూటలా ఒకవేలుతో తీసుకొని నాకిస్తూ ఉంటే ఎలాంటి జలుబు అయినా పరారవాల్సిందే.ఇందులో తేనె మరియు పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల పిల్లలకు ఎలాంటి జలుబు,దగ్గు నైనా తొందరగా తగ్గిస్తుంది.అంతేకాక రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.కావున మీ పిల్లలు కూడా ఈ జలుబుతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.