ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక నొప్పులతో బాధపడుతూ ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.కొంతమంది నడుము నొప్పి,మోకాళ్ళ నొప్పులంటూ బాధపడుతూ ఉంటే మరికొంతమంది భుజాల నొప్పి,కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. అలాంటివారు వీటిని తగ్గించుకోవడానికి రకరకాల పెయిన్ కిల్లర్లు వాడుతూ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకుంటూ ఉన్నారు.దీనికి కారణం ఎముకల మధ్య ఉన్న గుజ్జు తగ్గిపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాకాకుండా మన కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో మంచి చిట్కాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అంతగా ఉపయోగపడే ఆ చిట్కాలేంటో మనము తెలుసుకుందాం పదండి..

దీనికోసం ముందుగా ఒక 10 గ్రాముల మిరియాలు,10 గ్రాముల సొంటి పొడి,50 గ్రాముల నెయ్యి తీసుకుని, పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ ఉంచి, లో నెయ్యి వేసి,మరగనివ్వాలి.ఇప్పుడు పైన చెప్పిన మిరియాల పొడి,సొంటి పొడి వేసి బాగా కలిపి, ఉండలుగా చుట్టుకోవాలి.ఇలా చుట్టిన ఉండలను గాలి చొరబడిన గాజు సీసాలో ఉంచి రోజుకొకటి మనం భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఉంచి తీసుకోవడం వల్ల,ఎలాంటి నొప్పులకైనా నివారణ కలుగుతుంది.ఎముకల మధ్య గుజ్జును ఏర్పరచడంలో ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇందులో వాడిన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి.దీనితో శరీరం ఆరోగ్యంగా తయారవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.మరియు ఈ ఉండలని తరచూ తీసుకోవడం వల్ల,జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అయ్యి,కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు కూడా తొలగుతాయి.

అంతేకాక మధుమేహంతో బాధపడే వారికి కూడా రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని హెచ్చు తగ్గులు కాకుండా కాపాడుతుంది.కావున మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.మరియు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు రోజు ఇసుక కానీ గరుకు గచ్చు పైన నడవడం కానీ అలవాటు చేసుకోవడం వల్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: