ఇప్పుడున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు దువ్వితే చాలు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతు ఉంటుంది. మరికొంతమందిలో ఇలా రాలిరాలి,బట్టతల వాస్తు ఉంటుంది.అలా కాకుండా జుట్టు పదేపదే రాలకుండా,ఒక వెంట్రుకల ప్లేస్ లో పది వెంట్రుకలు పెరిగి,ఒత్తుగా ఉండాలనుకునే వారికి ఇంటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.ఏమంటే కాస్త ఓపికగా ఈ చిట్కాలు పాటించాలి.ఇలా పాటిస్తే మాత్రం,జుట్టు సమస్యలు తొలగించుకొని,చాలా మంచి పలితాలను పొందవచ్చు.మరియు తక్కువ ఖర్చులో,ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు కూడా .

దీని కోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జు,ఒక టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి, బాగా మిక్స్ చేయాలి.ఇలా వచ్చిన మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో తలకు మాడు నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట ఆరనివ్వాలి.ఇలా ఆరిన తరవాత మైల్డ్ షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. దీనిని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు గ్రోత్ పెరుగుతుంది.అంతేకాక డ్రై హెయిర్ గలవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.వారు 15 రోజులకి ఒకసారి ఈ చిట్కా పాటిస్తే నిర్జీవంగా వున్న జుట్టు మెరుపు సంతరించికొని,నిగనిగలాడుతుంది.

మరియు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఈ చిట్కా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని కోసం గోరింటాకు మిశ్రమంలో మందార ఆకులనుమీక్సీ పట్టి, రెండింటిని కలిపి జుట్టుకు అప్లై  చేయాలి.ఇలాగే అరగంట వరకు ఉంచి, ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.ఈ చిట్కా పాటించే వారు తప్పకుండా సిరం అప్లై చేసుకోవాలి.

జుట్టు చివర్లు చిట్లి,జుట్టు రాలడానికి దోహదపడుతుంది. దీని కోసం ఒక కప్పు పెరుగు తీసుకొని,అందులో రెండు కోడిగుడ్ల సొనను వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేయాలి.అలా గంట తరవాత షాంపూతో శుభ్రం చేయాలి.ఇలా పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే, జుట్టు రాలడం ఒక్క వాష్ లోనే తగ్గి,నిగనిగలాడే జుట్టు మీకు సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: