అంతేకాక ఇందులో పప్పును పెట్టి ఉడికించడం వల్ల నురగ తేలుతుంది.ఈ నూరగలో ప్యూరిన్ వంటి ఎన్నో కెమికల్స్ రిలీజ్ అయ్యి,మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్యూరిన్ తో అనారోగ్య సమస్యలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
పప్పు కుక్కర్ ని వాడాలనుకునేవారు కచ్చితంగా దానిపై నుంచి వచ్చే నురగను తీసివేయాలని ఆహార నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.ఎందుకంటే ఇందులో ప్యూరిన్ సమ్మేళనాలు శరీరానికి అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి.ముఖ్యంగా ఈ ప్యూరిన్లో మన ఆ పొట్టలోకి చేరి గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమవుతాయి.శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది.ఇలా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గుండెపోటు,కిడ్నీ వ్యాధి,కీళ్ల సమస్యలు వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు చేసిన పరిశోధనలు ప్రకారం పప్పు నురుగులో ప్యూరిన్ పరిమాణం 20 రెట్లు అధికంగా ఉంటుంది.ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది.కాయధాన్యాల నురుగును తొలగించి ఉడికించడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిని 20 శాతం తగ్గించవచ్చని పరిశోదనల్లో తేలింది.ఇంతకుముందు ఇతర దేశాల్లో నిర్వహించిన పరిశోదనలు కూడా నురుగును తీసివేసి పప్పును ఉడికించాలని వెల్లడించాయి.
కావున ప్రెజర్ కుక్కర్ బదులు గిన్నెలో వేసి ఉడికించుకోవడం చాలా మంచిదని వాటిపై వచ్చే నురగని ఈజీగా తీసివేయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.కావున మీరు కూడా ప్రెషర్ కుక్కర్ బదులుగా గిన్నెలను వాడడం చాలా మంచిది.మరి ముఖ్యంగా ప్రెజర్ కుక్కర్లను అల్యూమినియంతో చేయడం వల్ల,ఆ మెటల్ మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.కావున ఇక మీదట అల్యూమినియం పాత్రలను అస్సలు వాడకండి.