చాలామంది మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నీటిని తాగడమే మానేస్తూ ఉంటారు.అలాంటి వారి శరీరం డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటుంది.అధిక మోతాదులో నీరు తాగడం వల్లే మన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.ఇలా నీటిని తాగకుండా ఉండడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగకపోవడమే కాక,మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలు కూడా కలుగుతాయి.
అంతేకాక కిడ్నీలు మనం శరీరంలో ఉన్న మలినాలను వడకట్టేటప్పుడు ఆహారంలో తగిన నీటి శాతం ఉంటేనే, సరైన మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.కానీ మూత్రాన్ని పదేపదే ఆపుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగి కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
మూత్రాన్ని ఎక్కువసేపు స్టోర్ చేసుకోవడం వల్ల మూత్రశయం కూడా సాగుతుంది.ఇలా ఎక్కువ రోజులపాటు మూత్రాశయం సాగడం వల్ల,వారు మూత్రాన్ని కంట్రోల్ చేయడం అనే ప్రక్రియను అదుపులో ఉంచుకోలేక పోతారు.దానితో వయసు మళ్ళీ కొద్దీ మూత్రం వారికి తెలియకుండానే మూత్రశయం బయటకు విసర్జిస్తుంది.దీనివల్ల వయసు మళ్ళిన తర్వాత చాలా రకాల సమస్యలు కలుగుతాయి.
కావున ప్రతి ఒక్కరూ రెండు మూడు గంటలకు ఒకసారి అయినా మూత్రానికి వెళ్లడం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం.