సాధారణంగా ఇది పిచ్చి మొక్కలా,ముల్లుల ముల్లుల మొక్కగా అనిపిస్తుంది.కానీ దీనిలో ఉన్న గచ్చకాయలను తీసి,వాటిని పగలకొడితే నల్లటి విత్తనాలు కనిపిస్తాయి. ఆ నల్లటి విత్తనాలను ఎన్నో ఖరీదైన మందులకు బదులుగా ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు. అసలు గచ్చకాయను ఏ ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తారు మనము తెలుసుకుందాం పదండి..
మగవారిలో వర్బీజాలు..
చాలామంది మగవారికి వరిబీజం దిగుతూ ఉంటుంది అలాంటి వారి కోసం గచ్చకాయలను తీసుకొని,వాటిని ఎండబెట్టి వాటిలో ఉన్న విత్తనాలను తీయాలి.విత్తనాలను పొడిగా చేసి ఆముదంలో కలిపి రాత్రి అంతా అలాగే ఉంచాలి.ఇలా ఉంచిన ఆముదాన్ని రోజు పడుకునే సమయంలో వృషణాలకు అప్లై చేస్తూ ఉంటే నెలరోజుల్లోగా వరిబీజం తగ్గుతుంది.
ఇంకా షుగర్ తో బాధపడేవారికి ఈ విత్తనాలు పొడి చేసుకొని, పాలలో కలిపి తీసుకోవడంతో రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ క్రమబద్ధీకరించి షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది.కానీ షుగర్ అదుపులోకి వచ్చిన తర్వాత ఈ గింజలను మానివేయాలి.లేదంటే లో షుగర్ వచ్చే అవకాశం ఉంది.మరియు బట్టతల సమస్యతో బాధపడేవారు ఈ గింజల పేస్ట్‌ని బట్టతలపై అప్లై చేయడం వల్ల జుట్టు తిరిగి రావడం గమనిస్తారు.
ఈ గింజలను పొడి చేసి మజ్జిగలో చిటికెడు పొడి,ఉప్పు కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు,థైరాయిడ్ గ్రంథి సమస్యలు తగ్గిపోతాయి.గచ్చకాయ గింజల గుజ్జును తీసి,నేతితో కలిపి పొట్టపై రాయడంతో జ్వరం త్వరగా తగ్గుతుంది.రుతుక్రమ సమస్య ఉన్న స్త్రీలకు చిటికెడు గచ్చకాయ పొడి,ఐదు మిరియాల పొడి కలిపి తీసుకోవడంతో పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.ఎక్కడైనా వాతం నొప్పులుగా అనిపిస్తుంటే ఈ ఆకులను నూనెలో వేయించి,ఆ ఆకులను అక్కడ కట్టడం వల్ల శరీరంలోని అనేక రకాల నొప్పులు తగ్గుతాయి.
ఈ కాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.కావున ఈ సారి ఎక్కడైనా కనిపిస్తే వీటిని తప్పకుండా ఇంటికి తెచ్చుకోని,పొడి చేసి స్టోర్ చేసుకుంటే చాలు మందు బిళ్ళలను విసిరికొట్టొచ్చు.