వేసవికాలం వచ్చిందంటే చాలు దోమలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ప్రజలు.. ప్రపంచవ్యాప్తంగా దోమలు లేని ప్రదేశం ఏదీ లేదు.. వీటిని పూర్తిగా అంతం చేద్దామని సింగపూర్ వంటి ప్రాంతాలు ప్రయత్నించిన కానీ ఫలితం దక్కలేదట.. కానీ దోమలు ఇంట్లోకి రాకుండా కుట్టకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందట.. అయితే కొన్ని హోం రెమెడిస్ ఉపయోగించడం వల్ల చర్మం పైన ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించవు.. అలాంటి చిట్కాలను ఇప్పుడు చూద్దాం.


కొంతమంది ప్రముఖులు తెలిపిన ప్రకారం దోమలు ఇంటి పరిసరాలలో ఉండకుండా ఉండాలి అంటే వేప నూనె ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందట. దోమలు కుట్టకుండా చర్మం పైన క్రీమును ఉపయోగించకుండా వేప నూనెను ఉపయోగిస్తే దోమలను దూరం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వేప నూనెను చర్మం పైన ఉపయోగించకూడదనుకుంటే నీటిలో కొన్ని చుక్కల పెప్పర్ మెంట్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత చర్మం పైన రాసుకోవడం మంచిది.


దోమలను తొలగించడానికి మనం ఇంటి నివారణలో తులసి ఆకులను ఉపయోగించుకోవచ్చు.. ఇంటి కిటికీలకు, తలుపులకు.. తులసి ఆకులను ఉంచడం వల్ల దోమలు లోనికి రాకుండా చేస్తాయట..



మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరం లవంగాలతో పొగ పెట్టడం వల్ల కూడా దోమలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాయి.


దోమలు బెడద ఎక్కువగా ఉందని కొంతమంది రెఫీల్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. వీటి ద్వారా వచ్చే గాలి పీల్చడం వల్ల పలు రకాల సైడ్ ఎఫెక్టులను కూడా కలిగిస్తుంది. అందుకే సాధారణంగా మనకి దొరికేటువంటి నిమ్మకాయ, కర్పూరం, లవంగాలు ఆవనూనెతో ఇలా చేస్తే దోమలు వెళ్ళిపోతాయ.. ముందుగా నిమ్మకాయను సగం కోసి.. అందులో ఉండే గుజ్జు మొత్తం తీసేసిన తర్వాత నిమ్మకాయలో లవంగాలు వేసి.. ఆవనూనెతో వత్తి వేసి దీపం వెలిగించడం వల్ల ఆ వాసనకి దోమల సైతం ఏమూల ఉన్న ఊపిరాడక చచ్చిపోతాయట.


అలాగే మనకు ఇంట్లో ఉండేటువంటి వెల్లుల్లి నీ బాగా మెత్తగా నూరి దోమలు ఎక్కువ ఉండే చోట పెట్టడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: