చాలామంది లడ్డును చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. బూంది ని లడ్డుగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి చేకూర్చేందుకు యాలకులు అండ్ ఎండు ద్రాక్షాలు మరియు జీడిపప్పు లాంటివి చేరుస్తూ ఉంటారు. భారతదేశంలో స్వీట్స్ పేరుతో అత్యంత ప్రాచుర్యం పొందింది లడ్డు. పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ప్రస్తుతం చాలా రకాల లడ్డూలు తయారు చేస్తున్నారు. వాటిలో మోతీచూర్ లడ్డు, బేసన్ లడ్డులు మరియు బూందీ లడ్డులు ఇలా చాలా రకాలు తయారవుతున్నాయి.

అయితే ఈ రుచికరమైన లడ్డులను మొదట తయారు చేసింది స్వీట్ కోసం కాదట. మరి దేనికోసము అని ఆలోచిస్తున్నారా...? నిజానికి ఈ లడ్డును స్వీట్ కోసం కాదు మొదట వైద్య ఉపయోగం కోసం తయారు చేశారు. దీని చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం లడ్డు క్రీ.పూ.300-500 నాటికే భారతదేశంలో కనిపెట్టబడిందని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. అయితే దీన్ని తీపి లాగా కాకుండా వ్యాధిని నయం చేసేందుకు తయారు చేశారు.

దీనిని భారత దేశపు గొప్ప వైద్యుడు సుశ్రుతుడు కనుగొన్నారని చెప్పారు. వాస్తవానికి ఈయన లడ్డును తయారు చేసింది స్వీట్స్ కోసం కాదు. ఈ లడ్డుతో అతను రోగాలకు చేదు మందులను ఇచ్చేందుకు ఉపయోగించారు.  కానీ అనంతరం నుంచి ఇది ఒక స్వీట్ గా మారిపోయింది. ప్రజెంట్ లడ్డూను మించిన స్వీటే లేకుండా పోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆశ్చర్యపోతున్నారు. మనం చాలా సింపుల్ గా తీసుకుని తినేస్తున్న లడ్డు అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేందుకు తయారు చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మన భారతదేశంలో ఎన్ని స్వీట్స్ ఉన్నా సరే శుభకార్యాలకి ఎక్కువగా లడ్డూనే ఎంచుకుంటూ ఉంటారు. అంతలాగా పాపులర్ అయిపోయింది మరి ఈ లడ్డు. ఈ లడ్డును స్వీట్ కోసం కాదు మొదట వైద్య ఉపయోగం కోసం తయారు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: