ఈ సింపుల్ డైట్ తో ఒంట్లో కొవ్వుని ఐస్ లా కరిగించవచ్చు?ఈ రోజుల్లో చాలా మంది కూడా అధిక బరువు సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా ప్రజల్లో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఊబకాయం అనేది అనేక వ్యాధులకు మూలంగా మారుతుంది. అయితే మీరు  మీ బరువును త్వరగా తగ్గించుకోవాలనుకుంటే కొన్ని అద్భుతమైన చిట్కాలను అందించారు. కొన్ని సాధారణ నియమాలను పాటించడం ద్వారా 21 రోజుల్లో తన బరువును 7 కిలోలు తగ్గించుకోవచ్చు. కాబట్టి, మీరు కూడా బరువు తగ్గడంలో అలసిపోయినట్లయితే ఈ డైట్ ఫాలో అవ్వండి.వాస్తవానికి  అడపాదడపా ఉపవాసం చేయడం ద్వారా  బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. తినే విధానం, తినే సమయం ఇంకా ఆకలితో ఉండే సమయంపై శ్రద్ధ చూపించాలి. ఈ డైట్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. 


21 రోజుల పాటు అడపాదడపా ఉపవాసం చేయడం ద్వారా బరువును 7 కిలోలు ఈజీగా తగ్గించుకోవచ్చు.ఇంకో విధానం ఏంటంటే మీరు 8 గంటలలో ఎప్పుడైనా ఆహారం తినవచ్చు. ఆ తరువాత మీరు 16 గంటల వరకు ఏమీ తినవలసిన అవసరం లేదు. దీని కోసం మీరు మీ సౌలభ్యం ప్రకారం సమయాన్ని ఎంచుకోవచ్చు. ఇంకో డైట్ లో వారంలో 5 రోజులు ఆహారం తీసుకోవచ్చు. ఇంకా మిగిలిన రెండు రోజులు ఆకలితో ఉండాలి. ఇంకో డైట్ లో మొదటిసారిగా అడపాదడపా ఉపవాసం ప్రారంభించబోయే వారు ఈ పద్ధతిని అనుసరించాలి. ఇందులో 10 గంటలు తినడం మరియు 14 గంటలు ఉపవాసం ఉంటుంది.ఈ విధంగా చేయడం వల్ల మధుమేహం కూడా నియంత్రించబడుతుంది. జీవక్రియలు పెరుగుతాయి. వేగంగా బరువు కోల్పోతారు, చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పద్ధతిని అనుసరిస్తూ, పాలు, పండ్లు లేదా పండ్ల రసాలు, కొబ్బరి నీరు త్రాగాలి. చూయింగ్ గమ్ ఇంకా పాలు, కాఫీ లేదా టీలకు దూరంగా ఉండటం ప్రయోజనకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: