మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ కూడా ఒకటి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచేందుకు కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. మన బాడీలో ముఖ్యమైన అవయవం అయినా కిడ్నీ ని సురక్షితంగా చూసుకోవాలి. కిడ్నీ ని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిమ్మకాయ నీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా మారుస్తుంది. అందువల్ల రోజు నిమ్మ వాటర్ తాగడం చాలా మంచిది.

2. అదేవిధంగా ఎర్ర ద్రాక్షలో విటమిన్ బి 6, ఏ ఉంటాయి. ఇవి మూత్రపిండాలను శుభ్రంగా ఉంచేందుకు దామోదపడతాయి.

3. కొత్తిమీర మూత్రపిండాలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని టెస్ట్ కోసం కూరల్లో వాడుతూ ఉంటాము. దీనిని కనుక రెగ్యులర్గా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా మీ కిడ్నీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

4. కిడ్నీ ని శుభ్రం చేయడానికి రెడ్ క్యాప్సికం కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

5. కిడ్నీల పనితీరు బాగుండాలంటే డాండెలైన్ రూట్ నుంచి తయారైన టీ తీసుకోవడం మంచిది. ఈ టీ ని తాగడం ద్వారా కిడ్నీలు శుభ్రం అవ్వడమే కాకుండా అనేక అనారోగ్యాల బారిన నుంచి బయటపడవచ్చు.

పైన చెప్పిన ఆహారాలను మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని మీ కిడ్నీలో అనారోగ్యాల భారీ నుంచి కాపాడుకోండి. పైన చెప్పిన ఆహారాలను మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా కిడ్నీలు పనితీరు మాత్రమే బాగుంటుంది. మన కిడ్నీలు సురక్షితంగా ఉండాలంటే ఎక్కువగా ఆల్కహాల్ను అస్సలు సేవించకూడదు. ఆల్కహాల్ ను సేవించి ఈ ఆహారాలను తీసుకున్న పెద్దగా ఫలితం ఉండదు. అందువల్ల ఆల్కహాల్ నీ సేవించేవారు తక్షణమే మానుకుని ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా మీ కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మన బాడీలో ముఖ్యమైన అవయవం అయినా కిడ్నీ ని సురక్షితంగా చూసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: