చాలామంది నైట్ త్వరగా పడుకోకుండా ఫోన్స్ చూస్తూ ఉంటారు. మరికొంతమంది రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా లెగుస్తారు. రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా లేగటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం తొందరగా నిద్రలేచే అలవాటు చాలా తక్కువ మందికే ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లు తప్ప..మగవాళ్లు పొద్దు పొద్దున్నే లేచే దాకలాలు చాలా అంటే చాలా తక్కువ. ఇక పిల్లలయితే ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అంటూ 9,10 కి నిద్రలేస్తుంటారు.

 కానీ ఈ అలవాటు మన ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. మీకు తెలుసా? రాత్రి తొందరగా నిద్రపోయి, ఉదయం తొందరగా నిద్ర లేస్తే ఇంటి పనులు తొందరగా అయిపోవడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే మన శరీరంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి. అసలు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఉదయం 5గంటలకే నిద్రలేస్తే వ్యాయామం చేస్తే సమయం మీకు తక్కువగా ఉంటుంది.

 రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యటం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. అలాగే మీ శరీరం ఆరోగ్యంగా ఫిట్ కూడా ఉంటుంది. మీరు ప్రతిరోజు ఉదయం 5గంటలకే నిద్రలేస్తే మీ వ్యక్తిగత ఎదుగుదలను మీరు పూర్తిగా ఆస్వాదించోచ్చు. అండే ఉదయం లేచిన తర్వాత హుం వర్క్ చేసుకోవడం, బుక్స్, పేపర్స్ చదవడం చేయొచ్చు. ఇది మీ తెలివితేటలకు పదును పెడుతుంది. మీకు నాలెడ్జి ను కూడా పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం 5  గంటలకే నిద్రలేస్తే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య మీరు బ్రేక్ ఫాస్టే ను తినొచ్చు. ఉదయమునే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు కూడా బాగా అందుతాయి. దీనితో మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు రాత్రిపూట టీవీ, మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. లేదా తగ్గించాలి. అప్పుడే మీరు రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్రలేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: