సాధారణంగా మన అవయవాలలో ముఖ్యమైన అవయవం కిడ్నీ . ఇతర సమస్యలను ఎక్కువ డబ్బు పోసి పరీక్షించుకోవచ్చు కానీ .. కిడ్నీ సమస్యలను ఆ విధంగా తగ్గించుకోలేము . నిజానికి కొన్ని అలవాట్లు వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి . ఎక్కువ రోజులపాటు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే కిడ్నీల పనితీరు దెబ్బతింటుందని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు . కిడ్నీలు ఫిల్టర్ చెయ్యని సమయం లో టాక్సిన్స్ రక్తం లో చేరతాయి . దీంతో నిద్ర బద్ధకం ఏర్పడుతుంది .
తరచుగా మూత్రంలో రక్తం రావడం కూడా కిడ్నీలా పనితీరు దెబ్బతింటుందని చెప్పడానికి సంకేతం . మూత్రంలో నురగ రావడం కూడా దీనికి కారణం కావచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు . అదేవిధంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటే చర్మంపై దురదలు కనిపిస్తాయి . ర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి . కళ్ళ చుట్టూ కనిపించిన కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు . మంచి నిద్ర ఉన్న కళ్ళు ఉబ్బినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి .
అరికాళ్ళలో వాపు కనిపించిన కిడ్నీ లు ఫెయిల్యూర్ అయినట్లు భావించాలి . శరీరంలో నీటి శాతం పెరగడం కారణంగా అరికాలు ఉబ్బుతాయి . రాత్రులు ఎక్కువగా మూత్ర విసర్జన చేసే షుగర్ లక్షణంగా భావిస్తాం . కానీ కిడ్నీ సమస్యలు ఉన్న వారికి కూడా ఈ సమస్య ఏర్పడుతుంది . మూత్రం రంగు ఒక్కసారిగా మారినా కిడ్నీలా పనితీరు దెబ్బతింటుందని అర్థం చేసుకోవాలి . మూత్రపిండాలు దెబ్బతింటే మూత్ర ముదురు రంగులో వస్తుంది . పైన చెప్పిన సంకేతాలు కనుక మీలో కనిపిస్తే తప్పనిసరిగా వెంటనే డాటర్ ని సంప్రదించి తగిన జాగ్రత్తలను తీసుకోండి. లేదంటే ప్రాణాలకే రిస్క్ అని చెప్పుకోవచ్చు .