చాలామంది నార్మల్ దోశలను ప్రతిరోజు తింటూ ఉంటారు. కానీ దోశలతో కూడా మన ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకోవచ్చు అన్న సంగతి మీకు తెలుసా. ఎస్ మీరు వింటుంది అక్షరాలా నిజం. మనం రోజు టిఫిన్ రూపంలో తీసుకుంటున్నా దోసలతో కూడా మనం అనేక పోషకాలను పొందవచ్చు. ఆ దోశ పేరే బీట్రూట్ దోస. బీట్రూట్ లో ఎన్ని పోషకాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ పోషకాలు కారణంగా స్కిన్ వైట్ గా రావడం అండ్ రక్తం బాగా పట్టడం వంటివి జరుగుతాయి. టోటల్గా బీట్రూట్ వల్ల అనేక లాభాలు ఉంటాయి. రోజు ఈ బీట్రూట్ ని జ్యూస్ చేసుకుని తాగలేం. అటువంటివారు ఈ బీట్రూట్ దోసని తప్పక ట్రై చేయండి. మరి ఈ బీట్రూట్ దోస తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు:

బీట్రూట్ 1 , బంగాళదుంపలు రెండు, క్యారెట్ ఒకటి, ఉల్లిపాయ, పరిచిమిర్చి, పసుపు, ఉప్పు తగినంత, కరివేపాకు, నూనె, బియ్యపు పిండి ఒక కప్పు, మైదాపిండి ఒక కప్పు.

స్టెప్:

1. ఒక పాత్రలో బీట్రూట్ అండ్ బంగాళదుంప మరియు క్యారెట్ వేసి నీళ్లు పోసి ఉడికించాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి.

2. బంగాళదుంపలు అండ్ బీట్రూట్ ఉడికాక ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రుబ్బాలి

3. ఈ పేస్ట్ లో కొంచెం మిర్చి పేస్ట్, పసుపు, ఆవాలు, కరివేపాకు వేసి బాగా కలపాలి.

4. ఈ మిశ్రమంలో బియ్యపు పిండి అండ్ మైదాపిండి, ఉప్పు వేసి మరోసారి కలపాలి.

5. ఓ పావు గంట పాటు ఉంచిన అనంతరం అందులో ఉల్లిపాయ అండ్ కొత్తిమీర వేసుకోవాలి.

6. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని కొంచెం నూనె వేసి వేడి చేయాలి.

7. వేడెక్కిన అనంతరం పిండిని దోస రూపంలో పెనంపై వేసుకోవాలి.

8. ఇక అనంతరం ఏదైనా చట్నీ తో సర్వ్ చేసుకుని ఈ బీట్రూట్ దోసని ఆస్వాదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: