చాలామంది అందంగా ఉంటారు. మరి కొంతమందికి అందం అనేది ఉండదు. కొంతమంది యవ్వనంగా అందంగా కనిపిస్తూ ఉంటారు. మరి కొంతమంది యవ్వనంగా ఉండేందుకు వీటిని తినండి. నిత్యం యవ్వనంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటంతో ముడతలు మాయం అవుతాయి. నిత్యం యవ్వనంగా ఉండొచ్చు. టమాట్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. టమాటాలు తింటే యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.


సాల్మన్, ట్యూనా మాకెరెల్  ఫ్యాటి చేపలు తింటే శరీరానికి కావాల్సిన ఒమేగా-3 సులభంగా అందుతుంది. ఇది కోల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనితో ముడతలు రావు. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి . ఇందులోని మోనోశాచురేడేడ్ ఫ్యాటి యాసిడ్స్, విటమిన్ ఈ ఆక్సికరణ బత్తిడిని తగ్గిస్తాయి. వాల్నట్స్, బాదం వంటి నట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది . వీటిలో విటమిన్ ఈ, బీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నట్స్ తింటే చర్మం కణజాలం ఆరోగ్యంగా మారుతుంది . బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రిస్ వంటి బెర్రీస్ తింటే ఆరోగ్యం మెరుగు పడుతుంది.


ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఫ్రి రాడికల్స్ ను తొలగిస్తాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. గ్రీన్ టీ తాగితే టాక్సిన్లు తొలుగుతాయి. చర్మం మెరుస్తుంది. డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. డార్క్ చాక్లెట్ లో శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. చిలకడదుంప లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులోని బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. చిలకడ దుంప తింటే చర్మం కణాలు ఆరోగ్యంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: