చాలామందికి ఉదయమనే లెగగానే ఆకలి వేస్తూ ఉంటుంది. అలా కాళీ కడుపుతో తింటే గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదయమే తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగటం వల్ల జీర్ణక్రియ రెటు మెరుగుపడుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. బరువు అదుపులో ఉంచుతుంది. రోజు లేచిన తర్వాత ఖాళీ కడుపుతో కొద్దీ నిమిషాల పాటు మెడిటేషన్ చేయటం మంచి అలవాటు. దీనివల్ల రోజంతా మీ మైండ్ ఉల్లాసంగా ఉంటుంది. బత్తిడిని తగ్గిస్తుంది.  ఖాళీ కడుపుతో చిన్నప్పటి వ్యాయామాలు చెయ్యటం చాలా మంచిది.


దీనివల్ల మీ ఎనర్జీ రెట్టింపు అవుతుంది . శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది . రోజు ఉదయం లేచిన తర్వాత కొన్ని నిమిషాలు డెయిలీ ప్లాన్ చేసుకోవటం మంచిది . దీనివల్ల రోజులో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే చేయవచ్చు . కాళీ కడుపుతో కాసేపు దీర్ఘశ్వాస తీసుకోవటం వల్ల శరీరానికి అందే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది . ఫలితంగా మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది . ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి . ఉదయం పూట చల్లని నీటితో స్నానం చేయటం వల్ల మీ శరీరం ఉత్తేజానికి లోనవుతుంది .


ఫలితంగా రోజంతా మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు . మీకు గొప్పగా అనిపించే విషయాలను వ్రాసుకోవటం లేదా ఆలోచించటం వల్ల మీలో కృతజ్ఞతా భావం పెరుగుతుంది. ఫలితంగా రోజంతా పాజిటివ్ గా ఉంటారు. ఉదయమనే స్వచ్ఛమైన గాలిలో తిరగటం చాలా మంచిది. ఇది మీ మెదడును, శరీరాన్ని మరింత చైతన్యపరుస్తుంది. పార్క్ లేదా గ్రౌండ్ లో తిరగొచ్చు. ఉదయమునే పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవటం వల్ల రోజంతా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: