చాలామందికి డ్రాగన్ ఫ్రూట్ అనేది అసలు ఇష్టం ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ ని చూస్తేనే అసహ్యించుకుంటారు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ మాత్రం అస్సలు ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకోండి? ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న పండు ఏదైనా ఉంది అంటే అది డ్రాగన్ ఫ్రూట్. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనితో చర్మం సౌందర్యం కూడా పెరుగుతుంది. అదెలాగో చూద్దాం. ఈ మాస్క్ తయారు చేయటం కోసం డ్రాగన్ ఫ్రూట్ ను గుజ్జులాగా చేసి స్పూన్ నిమ్మరసం కలపాలి.


అలాగే ఓ స్పూన్ పసుపు, 2 స్పూన్ల దాచిన చెక్క పొడి వేసుకోవాలి. ఇందులోనూ కొన్ని చుక్కల రోజు వాటర్ వేసి బాగా కలిపి మిశ్రమంలా చెయ్యాలి. దీనిని 15 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచి తర్వాత ముఖానికి అప్లై చేసుకోవటమే. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ నేచురల్ హైడ్రేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ప్రతిరోజు ఈ పండు తినటం వల్ల ముఖాన్ని తేమగా ఉంచుకోవచ్చు. అలాగే దీన్ని ఫేస్ మాస్క్ కూడా ఉపయోగించవచ్చు.


డ్రాగన్ ఫ్రూట్ లోని విటమిన్ సి..చర్మం ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం స్థితిస్థాపకతను రెట్టింపు చేస్తాయి. తద్వారా చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు రాకుండా చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిలో దోహాదపడుతుంది. తద్వారా కొత్త చర్మం కణాలు ఏర్పడతాయి. దీనితో చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవచ్చు.పొడిబారిన చర్మంతో బాధపడేవారు రోజు డ్రాగన్ ఫ్రూట్ తినడం లేదా దాన్ని మాస్క్ వాడటం మంచిది. వీటిలోని నీటి శాతం వల్ల చర్మం తొందరగా హైడ్రేట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: