లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీ ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇందులో పాలీఫెనాల్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-క్యాన్సర్ లక్షణాలు ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.బాదం పప్పుల్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. శ్వాసనాళాల చుట్టూ ఉన్న కండరాలను సడలించేలా చేస్తుంది. ఊపిరితిత్తులకు మెరుగైన గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.అవోకాడోలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ తీసుకోవడం ద్వారా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను ప్రమాదాన్ని తగ్గిస్తుంది.సాల్మన్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులతో సహా శరీరంలోని వాపును తగ్గిస్తాయి. ఇంకా ఒమేగా-3లు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆస్తమా లక్షణాల తీవ్రతను తగ్గిస్తాయి.నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.


 రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి ఊపిరితిత్తులకు అందించే కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.ఇంకా అలాగే బచ్చలికూరలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ వాపును తగ్గించడం, ఊపిరితిత్తుల కణజాలాన్ని బలోపేతం చేసి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అధిక మెగ్నీషియం కంటెంట్ శ్వాసనాళాల చుట్టూ ఉన్న కండరాలను సడలించడంలో సాయపడి, తద్వారా శ్వాస తీసుకోవడం సులభంగా ఉంటుంది.టొమాటోలు లైకోపీన్ ఉంటుంది. ఇదో యాంటీఆక్సిడెంట్.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అందిస్తుంది. లైకోపీన్ అనేది ఆస్తమా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్  వంటి శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పుచ్చకాయలో విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన అణువులతో కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షిస్తుంది. అధిక నీటి కంటెంట్ కలిగి ఉండి వేసవి రోజులలో హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల పనితీరుకు సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: