ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు ఏదో ఒక ఫుడ్ లో ఖచ్చితంగా ఆయిల్ ని ఉపయోగిస్తూనే ఉంటారు ఆయిల్ లేకుండా అసలేం చెయ్యలేరు కానీసం రెండు స్పూన్లల ఆయిల్ ని అయినా ప్రతి రోజు ఉపయోగించాల్సిందే.ఇక ఓన్లీ ఆయిల్ తో మాత్రమే తయారయ్యే వంటకాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే మన భారతదేశం లో  చేసే చాలా రకాల వంటకాలలో నూనె లేకుండా పూర్తి కావు. ఇంకా చెప్పాలంటే ఆహారంలో నూనె లేకపోతే టేస్ట్ కూడా ఉండదు అని చెబుతూ ఉంటారు. అయితే నూనె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అన్న విషయం చాలా మందికి తెలిసిందే. అందుకే చాలామంది నూనె ఎక్కువగా వాడకుండా చాలా తక్కువగా మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతవరకు ఆయిల్ ఫుడ్ తీసుకోకపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ దాదాపు నెల రోజులపాటు అసలు ఆయిల్ లేకుండా ఉన్న ఆహారాలను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం? ఆయిల్ ఫుడ్ నుంచి కొత్తగా బ్రేక్ తీసుకుంటే మీ శరీరంపై మంచి ప్రభావం పడుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయిల్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. ఎసిడిటి, మల్లబద్ధకం అజీర్ణం ఇలాంటి సమస్యలు రావు అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే నూనె లేని ఆహారాలను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట.ఇంకా కోలెస్ట్రాల్ కూడా తగ్గి కంట్రోల్ లో ఉంటుందట


.మీ ఫుడ్ లో ఆయిల్ ను తొలగించడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గడం ప్రారంభమవుతుందట. అది క్రమంగా మీ గుండె పనితీరును మునుపటి కంటే మెరుగ్గా చేస్తుందట. గుండెకు సంబందించినా వ్యాధులు కూడా రావట. ఇది బీపీని అదుపులో ఉంచుతుందట. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఆహారం నుంచి కొవ్వును తగ్గించడం వల్ల కేలరీలు కూడా చాలా వరకు తగ్గుతాయని దీంతో ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా ఆయిల్ ఫుడ్ కి కొద్ది రోజులపాటు దూరంగా ఉండటం వల్ల మీరు మరింత శక్తివంతంగా, ఆరోగ్యం గా తయారవుతారట. అదేవిధంగా ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉండటం వల్ల మీ చర్మం మునుపటి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలుతగ్గడం, చార్మాన్ని కూడా సున్నితంగా ఉంచడానికి, అందంగా ఉండడం ప్రారంభమవుతుంది. దీనివల్ల మీ చర్మం శుభ్రంగా, క్లియర్ గా కనిపిస్తుందట. కాబట్టి నెల రోజులపాటు ఆయిల్ తీసుకోకపోతే శరీరానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. అయితే ఆయిల్ లేకుండా ఫుడ్ తినడం ఇష్టపడని వాళ్ళు ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో మాత్రమే ఆయిల్ ని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.కాబట్టి ఆయిల్ ఫుడ్ ని ఎక్కువగా కాకుండా తగ్గించుకొని తగినఅంత తీసుతీసుకోడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: